News November 4, 2024
రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్

భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ తనకు చివరిదని తెలిపారు. వచ్చే IPL వేలానికి కూడా ఆయన రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో ఈ 40ఏళ్ల వికెట్ కీపర్ IPLకూ గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. భారత్ తరఫున 40 టెస్టులు, 9 వన్డేలు ఆడిన సాహా, రంజీల్లో బెంగాల్, త్రిపుర జట్లకు, IPLలో KKR, CSK, PBKS, SRH, GTకి ప్రాతినిధ్యం వహించారు.
Similar News
News January 28, 2026
కేంద్ర సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు

ఢిల్లీలోని <
News January 28, 2026
వేరుశనగలో ఇనుపధాతు లోపం – నివారణ

చలి కారణంగా వేరుశనగలో ఈ సమయంలో ఇనుపధాతు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల లేత ఆకులు పసుపు పచ్చగా, తర్వాత తెలుపు రంగులోకి మారతాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 కిలో అన్నభేధి మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలిపి రెండు సార్లు పిచికారీ చేయాలి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకుంటే మొక్కల పెరుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది.
News January 28, 2026
నవ గ్రహాలు – వాటికి ఇష్టమైన పుష్పాలు

ఆదిత్యుడు – తామర(ఎరుపు)
చంద్రుడు – కలువ(తెలుపు)
అంగారకుడు – సంపంగి/మందార
బుధుడు – పచ్చ రంగు పుష్పాలు
గురు – మల్లె
శుక్రుడు – తెల్లని తామర
శని – నల్లని రంగు పుష్పాలు
రాహువు – అడవి మందారం
కేతువు – ఎర్ర కలువ


