News August 26, 2025

కాబోయే భార్యతో భారత క్రికెటర్.. ఫొటో వైరల్

image

టీమ్ ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన కాబోయే భార్య వన్శికతో కలిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. కుల్దీప్ బ్లాక్ సూట్‌లో, వన్శిక వైట్ గౌన్‌లో ఉన్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. వీరిద్దరికి జూన్ 4న ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఏడాది చివర్లో వివాహం జరగనున్నట్లు సమాచారం. లక్నోకు చెందిన వన్శిక LICలో జాబ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య చిన్ననాటి స్నేహం ప్రేమగా మారింది.

Similar News

News August 26, 2025

భూమన తీవ్ర ఆరోపణలు.. ఆ IAS ఎవరు?

image

AP: వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఓ సీనియర్ IAS అధికారిణిపై చేసిన <<17523215>>కామెంట్స్<<>> చర్చనీయాంశంగా మారాయి. ఆమె అవినీతిలో అనకొండలాంటిదని, TDR బాండ్ల ద్వారా రూ.వందల కోట్లు దోచుకోవాలని ప్రయత్నించిందని ఆరోపించారు. రోజూ ధరించే చీర రూ.లక్షన్నర అని, రూ.50 లక్షల కంటే విలువైన విగ్గులు ఆమెకు 11 ఉన్నాయని వ్యక్తిగతంగానూ విమర్శించారు. రోజుకో విగ్గుతో దర్శనమిస్తారన్నారు. అయితే ఆ అధికారిణి పేరు మాత్రం వెల్లడించలేదు.

News August 26, 2025

ఆ హీరోయిన్ అంటే మా నాన్నకు ఇష్టం: శ్రుతి హాసన్

image

బెంగాలీ నటి అపర్ణ సేన్ అంటే తన తండ్రి కమల్ హాసన్‌కు ఇష్టం ఉండేదని శృతిహాసన్ తెలిపారు. ‘నాన్న బెంగాలీలో ఒక సినిమా చేశారు. ఆ సమయంలో అపర్ణ సేన్‌తో ప్రేమలో పడ్డారు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి బెంగాలీ నేర్చుకున్నారు. నాన్న డైరెక్ట్ చేసిన “హే రామ్” మూవీలో హీరోయిన్ పాత్ర పేరును కూడా అందుకే అపర్ణ సేన్‌గా మార్చారు’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అపర్ణ సేన్ 9 జాతీయ అవార్డులు, 1987లో పద్మశ్రీ అందుకున్నారు.

News August 26, 2025

ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీలు.. స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ

image

TG: 2025-26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 48,630 సీట్లను పాఠశాల విద్యాశాఖ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనుంది. 6thలో 7,543, 7thలో 5,192, 8thలో 3,936, 9thలో 2,884, 10thలో 3,151, ఇంటర్ సెకండియర్‌లో 13,256, ఫస్టియర్‌లో 12,668 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ప్రవేశాలు కల్పించగా, మిగిలిన సీట్లను ఇప్పుడు భర్తీ చేయనుంది. సీట్ల కోసం స్కూళ్లలో సంప్రదించాలి.