News July 3, 2024
రేపు PM మోదీని కలవనున్న భారత క్రికెటర్లు.. ఎల్లుండి రోడ్ షో?

టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా రేపు ఉదయం 6 గంటలకు ఢిల్లీకి చేరుకోనుంది. ఉ.11 గంటలకు జట్టు సభ్యులు ప్రధాని మోదీని కలవనున్నారు. ఎల్లుండి బీసీసీఐ భారత జట్టు సభ్యులతో ముంబైలో భారీ రోడ్ షో నిర్వహించనున్నట్లు సమాచారం. ముంబైలోని పలు ప్రధాన రహదారుల్లో ఈ ర్యాలీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 3, 2026
YELLOW ALERT: 5 రోజులు వర్షాలు!

TG: రాష్ట్రంలో ఎండలు, అకాల వర్షాలతో విచిత్ర వాతావరణం కొనసాగుతోంది. పలు జిల్లాల్లో 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని IMD అధికారులు వెల్లడించారు. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో వానలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా 4 రోజుల వర్షాల అప్డేట్ కోసం పై ఫొటోను స్వైప్ చేయండి.
News April 3, 2026
అన్నామలైకి నో టికెట్.. మైలాపూర్ నుంచి తమిళి సై పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 27 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలైకి టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొత్తులో ఉన్న అన్నాడీఎంకేతో ఆయనకున్న విభేదాలే కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మైలాపూర్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై, సాత్తూర్ నుంచి బీజేపీ స్టేట్ చీఫ్ నాగేంద్రన్ బరిలో దిగుతున్నారు.<<-se>>#ELECTIONS2026<<>>
News April 3, 2026
ఫుడ్ రేట్లు పెంచారు సరే.. మళ్లీ తగ్గిస్తారా?

సరిపడా వంటగ్యాస్ సిలిండర్లు దొరకట్లేదని, బ్లాక్‌లో అధిక ధరకు కొంటున్నామని చాలా హోటళ్లు ఫుడ్ రేట్లను పెంచేశాయి. ఇందులో కొంత వాస్తవం ఉంది. అయితే గ్యాస్ సంక్షోభం తీరిపోతే పెంచిన ధరలను తగ్గిస్తారా? అని సామాన్యులకు సందేహం వస్తోంది. గతంలో కరోనా సమయంలో రేట్లను పెంచారు. ఆ మహమ్మారి వదిలి సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ అవే ధరలను కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు ఏం చేస్తారో? COMMENT?


