News April 19, 2024
UAEలోని భారత ఎంబసీ కీలక సూచనలు

యూఏఈలోని భారత ఎంబసీ భారత ప్రయాణికులకు కీలక సూచనలు చేసింది. దుబాయ్‌కు వచ్చేవారు లేదా దుబాయ్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అత్యవసరం కాని పక్షంలో ప్రయాణాల్ని రీషెడ్యూల్ చేసుకోవాలని సూచించింది. అక్కడ వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో పరిస్థితి చక్కబడే వరకు తమ సూచనల్ని అనుసరించాలని తెలిపింది. అవసరమైనవారికి సహాయం కోసం దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
Similar News
News December 4, 2025
హార్టికల్చర్ హబ్‌కి కేంద్రం ₹40వేల కోట్లు: CBN

AP: హార్టికల్చర్ హబ్‌గా 9 జిల్లాలను తయారుచేస్తున్నామని CM CBN తెలిపారు. దీనికోసం కేంద్రం పూర్వోదయ స్కీమ్ కింద ₹40వేల కోట్లు ఇస్తోందని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడుల్ని ఆకర్షించాలని చెప్పారు. అధికారులు టెక్నాలజీపై గ్రిప్ పెంచుకోవాలన్నారు. 7వ తరగతి నుంచే AI బేసిక్స్‌పై బోధన ఉండాలని సూచించారు. విశాఖ కాపులుప్పాడలో హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల కోసం 50 ఎకరాలు కేటాయించాలని చెప్పారు.
News December 4, 2025
తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం.. వెంకయ్య కీలక వ్యాఖ్యలు

AP: తాను చదువుకునే రోజుల్లో అవగాహన లేక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చి, ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. మచిలీపట్నం కృష్ణా వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘AP, TGలు తెలుగును పరిపాలనా భాషగా చేసుకోవాలి. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పాలి. అప్పుడే తెలుగు వెలుగుతుంది’ అని పేర్కొన్నారు.
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్‌ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.


