News April 7, 2025
‘ఇండియన్ ఐడల్’ విజేత మానసి ఘోష్.. ప్రైజ్ మనీ ఎంతంటే..

‘ఇండియన్ ఐడల్’ 15వ సీజన్లో బెంగాల్‌కు చెందిన మానసి ఘోష్ విజేతగా నిలిచారు. ట్రోఫీతో పాటు ఆమె సరికొత్త కారును, రూ.25 లక్షల ప్రైజ్ మనీని గెలుచుకున్నారు. ఫినాలేలో ఆమె శుభజిత్ చక్రవర్తి, స్నేహా శంకర్‌తో పోటీ పడ్డారు. శుభజిత్ రన్నరప్‌గా, స్నేహ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. కాగా స్నేహకు ఫినాలేకు ముందుగానే టీ-సిరీస్ అధినేత రికార్డింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడం విశేషం.
Similar News
News April 9, 2025
కమెడియన్ సప్తగిరి తల్లి కన్నుమూత

ప్రముఖ కమెడియన్, హీరో సప్తగిరి ఇంట్లో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి చిట్టెమ్మ నిన్న రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇవాళ తిరుపతిలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. దీంతో తోటి నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.
News April 9, 2025
SI సుధాకర్‌పై వైసీపీ శ్రేణుల ఆగ్రహం

AP: మాజీ సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన <<16038250>>రామగిరి SI సుధాకర్‌పై<<>> YCP శ్రేణులు ఫైరవుతున్నాయి. ఆయన టీడీపీ కోసమే పనిచేస్తున్నారనే దానికి ఈ పొలిటికల్ విమర్శలే నిదర్శనమని పేర్కొంటున్నాయి. టీడీపీ నుంచి గుంతకల్ అసెంబ్లీ సీటుకు పోటీ అంటూ గతంలో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను, లోకేశ్, అచ్చెన్న, సత్యకుమార్ తదితర మంత్రులతో ఆయన దిగిన ఫొటోలను షేర్ చేస్తున్నాయి. ఇదేనా నీ నిజాయితీ అని ప్రశ్నిస్తున్నాయి.
News April 9, 2025
BREAKING: తైవాన్‌లో భూకంపం

తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 మాగ్నిట్యూడ్ నమోదైంది. భూకంప ధాటికి రాజధాని తైపీలో భవనాలు షేక్ అయ్యాయి. 73 కి.మీ లోతులో భూమి కంపించిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. నష్ట తీవ్రతపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వివిధ దేశాల్లో వరుస భూకంపాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మయన్మార్, థాయిలాండ్‌లో భూకంపాల ధాటికి వేలాది మంది మరణించిన విషయం తెలిసిందే.