News February 3, 2025

చరిత్ర సృష్టించిన భారత ప్లేయర్

image

ENGతో T20 సిరీస్‌లో 14 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి చరిత్ర సృష్టించారు. ఓ ద్వైపాక్షిక T20 సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచారు. 2021లో AUSపై కివీస్ స్పిన్నర్ ఇష్ సోధీ 13 వికెట్లు తీయగా, వరుణ్ ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశారు. ఓవరాల్‌గా ఓ T20 సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా వరుణ్ నిలిచారు. 2022లో ENGపై 15 వికెట్లు పడగొట్టిన హోల్డర్(విండీస్) టాప్‌లో ఉన్నారు.

Similar News

News February 3, 2025

క్రీడలకు కేంద్రం ఎంత కేటాయించిందంటే?

image

2025-26 ఏడాదికి కేంద్రం బడ్జెట్ విడుదల చేయగా అందులో క్రీడా మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించింది. దీనితో చైనా బడ్జెట్‌ను పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చైనా ప్రభుత్వం రూ.27,741 కోట్లు క్రీడల కోసమే కేటాయించింది. క్రీడాకారులకు సరైన వసతులు కల్పించేలా బడ్జెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఒలింపిక్స్‌లో చైనాకు 91 మెడల్స్ వస్తే, ఇండియాకు 6 మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.

News February 3, 2025

కంకషన్ వివాదం: క్రిస్ బ్రాడ్ తీవ్ర విమర్శలు

image

భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ ముగిసినా కంకషన్ వివాదం మాత్రం ఇంకా చల్లారలేదు. దూబే స్థానంలో హర్షిత్ రాణాను సబ్‌స్టిట్యూట్‌గా భారత్ ఆడించడం అన్యాయమని ICC మ్యాచ్ రిఫరీ క్రిస్ ఆరోపించారు. ‘స్వతంత్రంగా వ్యవహరించే అధికారుల్నే ICC నియమించాలి. మరి ఇప్పుడు ఏమైంది. పక్షపాతం, అవినీతితో కూడిన పాత రోజుల్లోకి ఎందుకెళ్తోంది?’ అని ప్రశ్నించారు. మ్యాచ్ రిఫరీగా ఇరు దేశాలకు చెందని అధికారి ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

News February 3, 2025

తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.84,050కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.400 తగ్గి రూ.77,050గా నమోదైంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి.