News May 25, 2024

నేడు యూఎస్ వెళ్లనున్న భారత ఆటగాళ్లు

image

టీ20 వరల్డ్ కప్ కోసం ఇవాళ కొందరు టీమ్ ఇండియా ఆటగాళ్లు అమెరికా వెళ్లనున్నారు. తొలి బ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, సూర్య, అర్ష్‌దీప్ తదితరులు ముంబై నుంచి విమానం ఎక్కనున్నారు. సెకండ్ బ్యాచ్‌లో యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, రింకూ సింగ్ బయల్దేరనున్నారు. హార్దిక్ పాండ్య లండన్‌లో ఉండటంతో అక్కడి నుంచే నేరుగా యూఎస్ ఫ్లైట్ ఎక్కనున్నారు.

Similar News

News December 4, 2025

SBIలో 996 పోస్టులకు నోటిఫికేషన్

image

SBI 996 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. VP వెల్త్, AVP వెల్త్, కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, MBA, CFP/CFA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: sbi.bank.in

News December 4, 2025

కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయి?: MP

image

TG: కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్ సభలో BJP MP విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. తమ పరిధిలోకి రాదంటూ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ‘ఇది చిన్న విషయంగా నవ్వుతారు కానీ అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్న పెద్ద సమస్య. సర్పంచి ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారింది. సమస్య పరిష్కరిస్తే సర్పంచిగా గెలిపిస్తామని జనం అంటున్నారు. కోతులు ఏ శాఖ కిందికి వస్తాయో వెల్లడించాలి’ అని కోరారు.

News December 4, 2025

నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్‌ ఆస్తా పూనియా

image

భారత నౌకాదళంలో మొట్ట మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా చరిత్ర సృష్టించారు ఆస్తా పూనియా. ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఆఫ్‌ గోల్డ్‌’ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరర్‌కు చెందిన ఆస్తా ఇంజినీరింగ్‌ చేశారు. నేవీ యుద్ధవిమానాన్ని నడపడం ఆషామాషీ విషయం కాదు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఫైటర్‌ స్ట్రీమ్‌లో అడుగుపెట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారామె. ఎంతోమంది యువతులకు రోల్‌మోడల్‌గా నిలిచింది.