News February 5, 2025
కొత్త జెర్సీలో భారత ప్లేయర్లు

ఇంగ్లండ్తో జరిగే వన్డే సిరీస్కు టీమ్ఇండియా సిద్ధమైంది. కొత్త జెర్సీతో టీమ్ సభ్యులు దిగిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. భుజాల వద్ద జాతీయ జెండా రంగు పెద్దగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ & క్లాసీ లుక్తో ఉన్న జెర్సీలో మన ప్లేయర్లు అదిరిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపు విదర్భ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 26, 2026
జెండా ఆవిష్కరణ.. ఈ తేడాలు తెలుసా?

గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జెండాను ఎగురవేసే విధానంలో ఉండే తేడాలు చాలామందికి తెలిసుండదు. ఆగస్టు 15న ప్రధానమంత్రి కింద ఉన్న జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. దీనిని హోయిస్టింగ్ అంటారు. ఇది వలస పాలన నుంచి విముక్తిని సూచిస్తుంది. అదే జనవరి 26న పైన కట్టిన జెండాను విప్పుతారు. దీనిని ‘అన్ ఫర్లింగ్’ అంటారు. ఇది రాజ్యాంగం అమలులోకి రావడాన్ని సూచిస్తుంది. రాష్ట్రపతి దీనిని నిర్వహిస్తారు. SHARE IT
News January 26, 2026
బన్నీతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్

LCUని పక్కనపెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా తీసేందుకు సిద్ధమవడంపై డైరెక్టర్ లోకేశ్ కనగరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మైత్రీ మూవీ మేకర్స్ & బన్నీతో చాలాకాలంగా ఉన్న కమిట్మెంట్ కారణంగా ఈ మూవీ తొలుత పట్టాలెక్కనుంది. ఇది పూర్తయ్యాక ఖైదీ-2, విక్రమ్-2, రోలెక్స్ సినిమాలుంటాయి. రెమ్యునరేషన్ కారణంగా ఖైదీ-2 నుంచి వైదొలిగాననేది అవాస్తవం’ అని లోకేశ్ వెల్లడించారు.
News January 26, 2026
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పోస్టులు.. అప్లై చేశారా?

బారక్పోర్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


