News August 29, 2025
క్వార్టర్ ఫైనల్స్‌లో భారత ప్లేయర్లు

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో వరల్డ్ నం.2 వాంగ్(చైనా)పై సింధు వరుస సెట్లలో 21-19, 21-15 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. మెన్స్ డబుల్స్‌లో చిరాగ్, సాత్విక్ ద్వయం చైనా జోడీ లియాంగ్, వాంగ్ చాంగ్‌పై జయకేతనం ఎగురవేశారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో ధ్రువ్, తనీశా క్వార్టర్స్ దూసుకెళ్లారు. మరోవైపు రౌండ్-2లోనే లక్ష్యసేన్ పోరు ముగిసింది.
Similar News
News August 29, 2025
బీసీసీఐ అధ్యక్షుడిగా వైదొలిగిన రోజర్ బిన్నీ!

బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ వైదొలిగినట్లు తెలుస్తోంది. బోర్డు నిబంధనల ప్రకారం 70 ఏళ్లు నిండినవారు ప్రెసిడెంట్‌గా ఉండటానికి వీళ్లేదు. దీంతో ఆయన స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు సమాచారం. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా వ్యవహరిస్తున్నారు.
News August 29, 2025
రేపు పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ రీరిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పి. ఎ. అరుణ్ ప్రసాద్ తెరకెక్కించిన ‘తమ్ముడు’ సినిమా రేపు రీరిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు. తొలుత సెప్టెంబర్ 2న రీరిలీజ్ చేద్దామని భావించి తాజాగా డేట్ మార్చారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జల్సా’ సినిమా కూడా పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదలవనుంది.
News August 29, 2025
Duleep Trophy అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ

దులీప్ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంట్రల్ జోన్ ప్లేయర్ డానిష్ మలేవార్ డబుల్ సెంచరీతో అదరగొట్టారు. నార్త్ జోన్‌తో మ్యాచులో 222 బంతుల్లో 36 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 203 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. దులీప్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన తొలి విదర్భ ఆటగాడిగా డానిష్ రికార్డ్ సృష్టించారు. గతేడాది రంజీ ట్రోఫీలో రాణించడంతో ఆయన సెంట్రల్ జోన్‌కి ఎంపికయ్యారు. ప్రస్తుతం సెంట్రల్ జోన్ 488/3 రన్స్ చేసింది.