News December 16, 2024
భారతీయ తబలా కళకు ప్రపంచ ఖ్యాతి

మార్చి 9, 1951లో ముంబైలో జన్మించిన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, తండ్రి అల్లా రఖా నుంచి సంగీతంలో శిక్షణ పొంది హిందుస్థానీ సంగీతానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. భారతీయ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతంతో కలిపి ఫ్యూజన్ సంగీతానికి కొత్త దిశను చూపారు. గ్రామీ లాంటి ప్రపంచ పురస్కారాలు, దేశ అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. జాకీర్ జీవితం, సంగీత ప్రస్థానం భారతీయ తబలా కళకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టాయి.
Similar News
News January 25, 2026
చిరంజీవి-బాబీ మూవీ.. టైటిల్ ఇదేనా?

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో మరో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీ టైటిల్‌పై SMలో టాక్ నడుస్తోంది. ‘కాకా’ అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తారని, కుమార్తెగా కృతి శెట్టి కనిపిస్తారని సమాచారం. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో చిరుకు బాబీ హిట్ ఇవ్వడం తెలిసిందే.
News January 25, 2026
భర్తపైనే ఎదురుకేసు పెట్టి.. ఆస్తి రాయించుకుని..

AP: గుంటూరు(D)లో <<18938678>>భర్తను భార్య చంపిన<<>> కేసులో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. గోపీతో తన భార్య మాధురి వివాహేతర బంధం గురించి శివనాగరాజుకు తెలిసి కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో CC కెమెరాలు పెట్టాలని భర్త భావించాడు. దీంతో అతడి హత్యకు మాధురి ప్లాన్ చేసింది. భర్తపై PSలో ఫిర్యాదు చేసి, పుట్టింటి వారు కట్నంగా ఇచ్చిన ఆస్తిని తన పేరుతో రాయించుకుంది. తర్వాత గోపీ, ఓ RMPతో కలిసి హత్య చేసిందని తెలుస్తోంది.
News January 25, 2026
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఈ జాగ్రత్తలు

జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. క్లోరిన్ కలిపిన నీటిలో స్విమ్ చేసే ముందు మంచినీళ్లతో తలస్నానం చేసి క్యాప్ పెట్టుకోవాలి. స్విమ్మింగ్ తర్వాత మంచి నీళ్లతో తలస్నానం చేయాలి. ఎండలోకి వెళ్లే ప్రతిసారీ సన్‌స్ర్కీన్ హెయిర్ స్ర్పే వాడాలి. తలకు మరీ వేడి/ చల్లని గాలి తరచూ తగలకుండా స్కార్ఫ్/ క్యాప్ పెట్టుకోవాలి. వీటితో పాటు పోషకాహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


