News August 19, 2025
మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన

సెప్టెంబర్ 30 నుంచి జరిగే ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తెలుగు ప్లేయర్లు అరుంధతి రెడ్డి, శ్రీచరణికి చోటు దక్కింది.
జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (WK), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తికా భాటియా (WK), స్నేహ్ రాణా
Similar News
News August 19, 2025
రైళ్లలో లగేజ్ వెయిట్ రూల్స్.. త్వరలో అమలు!

రైల్వే శాఖ ఎయిర్‌పోర్ట్ తరహా లగేజ్ వెయిట్ రూల్స్‌ను త్వరలో తీసుకురానుంది. ఫస్ట్ AC కంపార్ట్‌మెంట్‌లో 70కేజీలు, సెకండ్ AC 50 KG, థర్డ్ AC/స్లీపర్ 40 KG, జనరల్/2S 35 KG వరకు తీసుకెళ్లొచ్చు. పరిమితికి మించి తీసుకెళ్లాలంటే ముందే బుకింగ్ చేసుకోవాలి. లేదంటే జరిమానా విధిస్తారు. సైజు విషయంలోనూ పరిమితులుంటాయి. ఈ రూల్స్ తొలుత నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎంపిక చేసిన 11 స్టేషన్లలో అమలవుతాయి.
News August 19, 2025
NEET(PG) ఫలితాలు విడుదల

నీట్(పీజీ)-2025 ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) రిలీజ్ చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఇక్కడ <
News August 19, 2025
మోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రో ధరలు తగ్గించాలి: KTR

TG: రేపు GST కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో కేంద్రానికి మాజీ మంత్రి KTR లేఖాస్త్రం సంధించారు. GSTలోని 12% శ్లాబ్ రద్దు ప్రతిపాదన కంటితుడుపు చర్య అని విమర్శించారు. ప్రధాని మోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గించాలన్నారు. రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్న పన్నులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టాలని KTR సూచించారు.