News August 19, 2025

నేడే ఆసియా కప్ కోసం భారత జట్టు ప్రకటన?

image

ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ ఇవాళ జట్టును ప్రకటిస్తుందని వార్తలు వస్తున్నాయి. జట్టు సెలక్షన్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశంలో జట్టు కూర్పుపై వారు మాట్లాడతారని సమాచారం. అలాగే పాకిస్థాన్‌తో జరిగే మ్యాచులపైనా స్పష్టత ఇచ్చే అవకాశముంది.

Similar News

News August 19, 2025

ఏపీ ముచ్చట్లు

image

* ఇవాళ శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు తిరుమల బ్రహ్మోత్సవాలు. తొలి రోజున శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పణ. సెప్టెంబర్ 28న గరుడసేవ.
* సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న అంగన్వాడీల నిరసన
* రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ బోర్డు(SBTET)కు NCVET గుర్తింపు. ఇకపై సాంకేతిక విద్య పరిధిలోని కోర్సులు చేసిన విద్యార్థులకు డ్యుయల్ సర్టిఫికెట్.

News August 19, 2025

ఈ నెల 22న తెలంగాణ బంద్

image

TG: మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ తెలిపింది. గుజరాత్, రాజస్థాన్ నుంచి వారు ఇక్కడికి వలస వచ్చి కులవృత్తులను దెబ్బతీస్తున్నారని మండిపడింది. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా మార్వాడీ గో బ్యాక్ అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు.

News August 19, 2025

సైనికుల చేతికి హైదరాబాద్ మెషీన్ గన్స్

image

TG: హైదరాబాద్‌కు చెందిన మరో తుపాకీ ఆర్మీ చేతికి అందనుంది. బాలానగర్‌లోని లోకేశ్ మెషీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ‘అష్మీ’ పేరుతో సబ్ మెషీన్ గన్ తయారు చేసింది. దీంతో ఆర్మీ రూ.17.7 కోట్ల విలువైన ఆర్డర్‌ను ఈ సంస్థకు ఇచ్చింది. ఇది 1,800 మీటర్ల రేంజ్‌ను ఛేదించగలదు. MMG కంటే 25 శాతం బరువు తక్కువగా ఉంటుంది. 250 తూటాల బెల్ట్ కెపాసిటీ దీని సొంతం. మైనస్ 40 నుంచి 55 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఇది చక్కగా పనిచేస్తుంది.