News August 14, 2025

ఈ నెల 19న భారత జట్టు ప్రకటన?

image

ఈ నెల 19న ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. జట్టు సెలక్షన్ అనంతరం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా సమావేశం నిర్వహిస్తారని సమాచారం. ఆ సమావేశంలోనే జట్టును ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రాబబుల్ జట్టు అంచనా: అభిషేక్, శాంసన్, సూర్య, తిలక్, హార్దిక్, గిల్, దూబే, అక్షర్, సుందర్, వరుణ్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, హర్షిత్/ప్రసిద్ధ్, జితేశ్/జురేల్.

Similar News

News August 15, 2025

ఇండియాపై టారిఫ్స్ వల్లే పుతిన్ కలుస్తున్నారు: ట్రంప్

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ తనను కలవడం వెనుక భారత్‌పై వేసిన అదనపు టారిఫ్స్ కూడా ఓ కారణమని US అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ‘ప్రతి నిర్ణయానికి ఓ ప్రభావం ఉంటుంది. ఇండియాపై రెండోసారి విధించిన సుంకాలు వారిని రష్యా నుంచి ఆయిల్ కొనకుండా ఆపేశాయి. మీ రెండో అతిపెద్ద కస్టమర్‌ని కోల్పోయినప్పుడు, మొదటి అతిపెద్ద కస్టమర్‌ని కోల్పోబోతున్నప్పుడు బహుశా ఆ ప్రభావం ఉందని భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.

News August 15, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 15, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.43 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.59 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.21 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.48 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.42 గంటలకు
✒ ఇష: రాత్రి 7.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News August 15, 2025

ప్రజాస్వామ్యం గెలిచింది: అచ్చెన్నాయుడు

image

AP: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తుతో వైసీపీ దొంగ ఓట్లు, జిమ్మిక్కులు పనిచేయలేదు. ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇది ప్రజా విజయం. 2024లో ప్రజలు వారిని 11 స్థానాలకే పరిమితం చేసినా.. జగన్‌లో ఇంకా మార్పు రాలేదు’ అని వ్యాఖ్యానించారు.