News April 15, 2025
బంగ్లాదేశ్లో భారత జట్టు పర్యటన.. షెడ్యూల్

భారత సీనియర్ మెన్స్ జట్టు ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టులో జరిగే ఈ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది. మిర్పూర్ వేదికగా 17, 20 తేదీల్లో తొలి రెండు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 23న చట్టోగ్రామ్లో 3 వన్డే ఆడనుంది. ఆ తర్వాత తొలి T20 ఆగస్టు 26న చట్టోగ్రామ్లో, మిగతా రెండు T20లను ఆగస్టు 29, 31 తేదీల్లో మిర్పూర్ వేదికగా ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది.
Similar News
News April 17, 2025
కాంగ్రెస్ను చూసి బీజేపీ భయపడుతోంది: భట్టి

TG: కాంగ్రెస్ నేతలను చూసి BJP భయపడుతోందని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. HYDలోని ఈడీ ఆఫీసు ముందు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్ కేసులకు భయపడరని చెప్పారు. బ్రిటిష్ వారికే ఆ కుటుంబం భయపడలేదన్నారు. సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తే కేసులు పెట్టి విచారణకు పిలుస్తారా అని ప్రశ్నించారు. కేంద్రం తీరును ప్రతి ఒక్కరూ ఎండగట్టాలన్నారు. కార్పొరేట్ సంస్థలపై బీజేపీ ఆధారపడుతోందని ఆరోపించారు.
News April 17, 2025
రాజకీయ కక్షతోనే వారిపై కేసులు: శ్రీధర్ బాబు

TG: రాజకీయ కక్షతోనే సోనియా, రాహుల్పై కేసులు పెట్టారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. షేర్ హక్కులు లేకుండానే మనీలాండరింగ్ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రూ.90 కోట్ల అప్పులు ఉన్నా ప్రజల కోసం సంస్థను నడుపుతున్నారని తెలిపారు. దేశం కోసం రాజీవ్ ప్రాణాలు అర్పిస్తే వారి కుటుంబంపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నిరంకుశ ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామన్నారు.
News April 17, 2025
మంచు లక్ష్మి ఇన్స్టా అకౌంట్ హ్యాక్

నటి మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. ‘ఈ యాప్లో ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు. నేను కూడా ఇది వాడుతున్నా’ అంటూ దుండగులు ఆమె ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. విషయం తెలిసిన లక్ష్మి ఇలాంటివి నమ్మొద్దని, తన ఇన్స్టా అకౌంట్ హ్యాక్ అయిందని ట్వీట్ చేశారు. తనకు డబ్బు అవసరమైతే సోషల్ మీడియాలో కాకుండా నేరుగా అడుగుతానని, స్టోరీలకు రిప్లై ఇవ్వొద్దని సూచించారు.