News April 8, 2025
ట్రై-సిరీస్‌కు భారత మహిళల జట్టు ప్రకటన

సౌతాఫ్రికా, శ్రీలంకతో ఈ నెల 27 నుంచి జరగనున్న ట్రై-నేషన్ ODI సిరీస్ కోసం భారత మహిళల జట్టును BCCI ప్రకటించింది. గాయం కారణంగా రేణుకా సింగ్, టిటాస్ సాధును సెలక్షన్స్‌కు పరిగణించలేదు.
జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన, ప్రతిక, హర్లీన్, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, దీప్తి శర్మ, అమన్ జోత్ కౌర్, కాశ్వీ గౌతమ్, స్నేహ్ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్ హసబ్నీస్, శ్రీ చరణి, సుచి ఉపాధ్యాయ్.
Similar News
News October 29, 2025
బాత్రూమ్లో ఈ తప్పులు చేయకండి!

బాత్రూమ్లో స్నానం చేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.
*బాత్రూంలో ఫోన్ వాడొద్దు.
*మూత తెరిచి ఫ్లష్ చేస్తే వ్యాధికారక క్రిములు వ్యాపిస్తాయి.
*ఎక్కువ సేపు కమోడ్‌పై కూర్చుంటే పైల్స్ రావచ్చు.
*రోజూ వేడి నీటి స్నానం చర్మాన్ని పొడి బారుస్తుంది.
*ఎక్కువ సబ్బు వాడటం చర్మానికి హానికరం.
*బలంగా టవల్‌తో రుద్దితే అది చర్మానికి నష్టం కలిగిస్తుంది. Share it
News October 29, 2025
ఆ రూ.20 లక్షలు మాకొద్దు: బాధితురాలు

కరూర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాల సహాయార్థం TVK చీఫ్ విజయ్ రూ.20 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ డబ్బును తిప్పి పంపడం చర్చనీయాంశమైంది. ‘మాకీ డబ్బు ముఖ్యం కాదు. నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందు డబ్బు తీసుకోమని చెప్పారు. ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. చెన్నై సమావేశానికి వెళ్లేందుకు మేము నిరాకరిస్తే మా బంధువులను తీసుకెళ్లారు’ అని తెలిపారు.
News October 29, 2025
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్‌లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్స్ మార్చాలి. మైల్డ్, సువాసన లేని సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.


