News March 26, 2025
కాంస్య పతకం గెలిచిన భారత రెజ్లర్

జోర్డాన్ రాజధాని అమ్మన్లో జరుగుతోన్న సీనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్-2025లో భారత రెజ్లర్ కాంస్య పతకం గెలుచుకున్నారు. 87 కేజీల విభాగంలో చైనా రెజ్లర్‌ను చిత్తు చేసి బ్రాంజ్ మెడల్ సాధించారు. దీంతో భారత్ పతకాల ఖాతా తెరిచింది. హరియాణాకు చెందిన సునీల్ గతంలో ఏషియన్ ఛాంపియన్ షిప్స్‌లో ఒక గోల్డ్ (2020), ఒక సిల్వర్ (2019), రెండు బ్రాంజ్ (2022, 2023) మెడల్స్ గెలిచారు.
Similar News
News October 15, 2025
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధికి ప్రణాళిక

AP: శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఘాట్ రోడ్ విస్తరణ, భక్తుల కోసం సౌకర్యాల ఏర్పాటు తదితర అభివృద్ధి పనులకు అటవీ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. 3 దశల్లో డెవలప్మెంట్ పనులకు దాదాపు 4,900 ఎకరాల అటవీ భూములు అవసరం కానున్నాయి. ఈనెల 16న ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న నేపథ్యంలో ఈ భూములపై నివేదిక అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
News October 15, 2025
బియ్యప్పిండితో బ్యూటీ

విటమిన్-బి అధికంగా ఉండే బియ్యం చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఈ పిండితో చేసే బ్యూటీ మాస్క్లేంటో చూద్దాం. * స్పూన్ బియ్యం పిండి, ఎగ్ వైట్ వేసి కలపాలి. ఆ పేస్ట్‌ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. * టమాటా రసం, గోధుమపిండి, బియ్యంపిండి కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగేయాలి. దీంతో ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
News October 15, 2025
కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు

TG: తీవ్ర ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ OSD సుమంత్‌ను ప్రభుత్వం తొలగించింది. మంత్రుల మధ్య విభేదాలకు కారణమయ్యేలా సమాచారాన్ని లీక్ చేస్తున్నారని, మేడారం పనుల టెండర్లలోనూ గోల్‌మాల్‌కు యత్నించారని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. సెటిల్మెంట్లు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. తీవ్రంగా స్పందించిన CM రేవంత్ ఆయనను తొలగించాలని నేరుగా ఆదేశించినట్లు సమాచారం.