News August 4, 2024
‘ఇండియన్2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘ఇండియన్2’ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 9 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళంలో ప్రసారమవుతుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్టర్ ద్వారా తెలిపింది. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్, సిద్ధార్థ్ సహా పలువురు కీలకపాత్రలు పోషించారు.
Similar News
News March 4, 2026
TODAY HEADLINES

☛ చంద్రబాబు-పవన్ భేటీ.. జల్ జీవన్ మిషన్, హనుమాన్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చ
☛ ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM రేవంత్
☛ చంద్రగ్రహణం.. ఎర్రని రంగులో కనువిందు చేసిన చంద్రుడు
☛ కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
☛ ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం: IAEA
☛ యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి
News March 4, 2026
పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర: ఖవాజా ఆసిఫ్

ఇరాన్‌పై జరుగుతున్న దాడుల వెనుక జియోనిజం(ఇజ్రాయెల్ జాతీయవాదం) ప్లాన్ ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. తమ దేశ సరిహద్దుల వరకు ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని విస్తరించాలని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇందులో అఫ్గాన్, ఇండియాకు భాగముందన్నారు. తమ అణుశక్తిని ప్రపంచం గుర్తించిందని, దేశాన్ని కాపాడేందుకు సైన్యం రెడీగా ఉందని చెప్పారు.
News March 4, 2026
4 నెలల బాబుకు ప్రాణం పోశారు!

TG: ఆరోగ్య సమస్యలు, తక్కువ బరువు(2.8kgs)తో కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన 4నెలల బాబు ప్రాణాలను డాక్టర్లు కాపాడారు. కాలిన గాయాలు, రక్తహీనత, శ్వాస సమస్యలతో బాధపడుతున్న మడకం శివ అనే చిన్నారిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. 36 రోజుల చికిత్స తర్వాత బాలుడి బరువు 4.25kgsకి పెరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. చిన్నారికి మెరుగైన చికిత్స అందించిన డాక్టర్లపై ప్రశంసలొస్తున్నాయి.


