News February 5, 2025

నా మందు ఇండియన్లు తాగటం లేదు: పాంటింగ్

image

తన కంపెనీ ‘పాంటింగ్ వైన్స్’పై భారతీయులు ఆసక్తి చూపడం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నారు. ఇండియాలో తన బ్రాండ్‌ను పంపిణీ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘ఢిల్లీలో నా కంపెనీ మద్యం బాగానే అమ్ముడవుతోంది. ఇప్పుడిప్పుడే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పన్నులు, టారిఫ్‌లు సవాళ్లుగా మారాయి’ అని ఆయన పేర్కొన్నారు. IPLలో పాంటింగ్ PBKS హెడ్ కోచ్‌గా ఉన్నారు.

Similar News

News November 15, 2025

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌.. సత్య నాదెళ్లకు ఆహ్వానం?

image

డిసెంబర్ 8, 9న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌’ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్లను ఆహ్వానించాలని ప్రయత్నిస్తోంది. వచ్చేనెల నాదెళ్ల INDలో పర్యటించనున్నట్లు సమాచారం. దీంతో ఆయన టూర్ షెడ్యూల్‌పై అధికారులు ఆరా తీస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే నాదెళ్ల రాకపై క్లారిటీ రానుంది.

News November 15, 2025

దివ్యాంగుల రిజర్వుడ్ పోస్టుల భర్తీ గడువు పొడిగింపు

image

AP: అన్ని ప్రభుత్వ విభాగాల్లోని దివ్యాంగుల రిజర్వుడ్ ఖాళీలను ప్రత్యేక రిక్రూట్‌మెంటు ద్వారా భర్తీ చేయడానికి నిర్ణయించిన గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ బ్యాక్‌లాగ్ కేటగిరీ పోస్టులను 2026 మార్చి 31లోగా భర్తీ చేయాలని సూచించింది. ఈమేరకు మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. గతంలో 2024 మార్చి 31లోగా పోస్టుల భర్తీకి గడువు నిర్దేశించగా తాజాగా దాన్ని పొడిగించింది.

News November 15, 2025

ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి చేశారు: చాందిని చౌదరి

image

కెరీర్ ప్రారంభంలో ఓ మూవీలో ముద్దు సీన్లలో నటించాలని ఒత్తిడి తెచ్చారని హీరోయిన్ చాందిని చౌదరి అన్నారు. ‘కథ చెప్పినప్పుడు ముద్దు సీన్ల గురించి చెప్పలేదు. ఆ సమయంలో అర్జున్‌రెడ్డి సినిమా విడుదలై హిట్ అయింది. దీంతో మా సినిమాలోనూ కిస్ సీన్లు పెడితే హిట్ అవుతుందని అనుకున్నారు. దర్శకుడు చెప్పినట్టు చేయకపోతే చెడ్డపేరు వస్తుంది. అయితే, హీరో చేయనని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నాను’ అని చెప్పారు.