News August 23, 2024
భారతీయులు వీసా లేకుండానే శ్రీలంకకు వెళ్లొచ్చు!

భారత పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అక్టోబరు 1 మొదలు 6 నెలల పాటు భారత్ సహా 35 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. శ్రీలంక పర్యాటకాన్ని మరింత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. భారత్‌తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, సౌదీ, యూఏఈ, ఖతర్ తదితర దేశాలు వీసా ఫ్రీ జాబితాలో ఉన్నాయి.
Similar News
News March 5, 2026
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 48 పోస్టులు

<
News March 5, 2026
మహిళలకు ఉచితంగా హెల్త్ చెకప్‌లు

TG: రాష్ట్రంలోని 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఫ్రీగా హెల్త్ చెకప్‌లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 8న మహిళా దినోత్సవం రోజు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ తెలిపారు. టీ-డయాగ్నోస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేస్తారు. అన్ని రకాల రిపోర్టులతో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తారు.
News March 5, 2026
మాయిస్ట్ హీట్‌తో ఈ సమ్మర్ వెరీ హాట్!

గాలిలో ఉష్ణోగ్రతతో పాటు తేమ ఎక్కువగా ఉంటే ‘మాయిస్ట్ హీట్’ అంటారు. ఈ సమ్మర్‌లో ఇది ఎక్కువ రోజులు ఉండనుంది. ‘సాధారణంగా ఎండలకు పట్టిన చెమట గాలికి ఆవిరై శరీరం చల్లబడుతుంది. మాయిస్ట్ హీట్‌తో గాలిలో తేమ ఉండటం వల్ల చెమట ఆవిరి కాదు. అయినా శరీరంలో నీటిశాతం తగ్గుతుంది. దీంతో దాహం వేయకపోయినా నీరు తాగాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు. గాలిలో తేమ 60%, టెంపరేచర్ 30°C ఉంటే అది మనకు 40°C మాదిరి అనిపిస్తుంది.


