News November 28, 2024

బడ్జెట్‌లో భారతీయులు ఈ దేశాలు చుట్టేయొచ్చు!

image

విదేశాలకు వెళ్లాలని ఉన్నా, అందుకు రూ. లక్షల వెచ్చించాల్సి ఉండటంతో చాలామంది ఆగిపోతుంటారు. అయితే, అందుబాటు బడ్జెట్‌లో భారత్ చుట్టుపక్కల ఉన్న 5 దేశాలను చక్కగా చూసి రావొచ్చు. అవి.. నేపాల్, శ్రీలంక, భూటాన్, మయన్మార్, థాయ్‌లాండ్. ఇవన్నీ వివిధ సంస్కృతులతో కూడినవే కాక చక్కటి ప్రకృతి రమణీయతతో కనువిందు చేస్తుంటాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే చాలా తక్కువ బడ్జెట్‌లోనే ఈ దేశాలకు టూర్ వేసేయొచ్చు.

Similar News

News November 20, 2025

పోలి పాడ్యమి కథ వింటే కలిగే ఫలితాలివే..

image

పోలి పాడ్యమి రోజున నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే ఈ శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
☞ ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. ☞ స్వర్గ ప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. ☞ మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. ☞ కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ☞ భక్తి, శ్రద్ధల మూలంగా ఈ గొప్ప ఫలాలు అందడం మన అదృష్టం.

News November 20, 2025

4,116 పోస్టులకు నోటిఫికేషన్

image

<>RRC <<>>నార్తర్న్ రైల్వే 4,116 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.rrcnr.org

News November 20, 2025

పండ్ల తోటల్లో పిందె/కాయలు రాలకుండా ఉండాలంటే?

image

పిందె, కాయలు ఎదిగే దశల్లో, పోషక లోపాల నివారణ కోసం, సూక్ష్మ, స్థూల పోషకాలను అందించాలి. కాయ ఎదుగుతున్న దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి. పండ్ల తోటలను ఆశించే పురుగులు, తెగుళ్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నివారణ చర్యలను పాటించాలి. అధిక సంఖ్యలో పిందెలు ఏర్పడితే బలహీనమైన, తక్కువ పరిమాణంలో ఉన్న పిందెలను తీసేస్తే పోషకాలు సమానంగా అంది రాలడం తగ్గుతుంది. పండు ఈగ కట్టడికి మిథైల్ యూజినాల్ ఎర వాడాలి.