News March 29, 2025
మయన్మార్‌కు భారత్ సాయం

భారీ <<15913182>>భూకంపంతో<<>> అతలాకుతలం అయిన మయన్మార్‌కు భారత్ అండగా నిలిచింది. ఆ దేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరకులు ఉండనున్నాయి. హిండన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి IAF C-130J ఎయిర్‌క్రాఫ్ట్‌లో వీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Similar News
News March 31, 2025
ప్రతిదాడి తప్పదు.. USకు ఇరాన్ వార్నింగ్

న్యూక్లియర్ ఒప్పందానికి అంగీకరించకుంటే <<15942110>>దాడులు చేస్తామన్న<<>> US అధ్యక్షుడు ట్రంప్‌కు ఇరాన్ అదే స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అమెరికా అన్నంత పనిచేస్తే తాము ఎదురుదాడులు చేస్తామని సుప్రీం లీడర్ అయతుల్లా తేల్చిచెప్పారు. కాగా ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్షిపణులను లాంచ్‌ప్యాడ్‌లపై సిద్ధంగా ఉంచినట్లు అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. అగ్రరాజ్యంపై దాడులకు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొంటున్నాయి.
News March 31, 2025
GOOD NEWS: రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు

TG: ‘రాజీవ్ యువ వికాసం’ పథకం గడువును APR 14 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇది వరకు షెడ్యూల్ ప్రకారం APR 4 వరకే ఉండగా, పలువురి విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా 5 లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60-80% వరకు రాయితీతో ఇవ్వనుంది. అప్లై <<15922104>>చేసుకోవడానికి<<>> రేషన్ కార్డు/ఇన్‌కం సర్టిఫికెట్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటో అవసరం.
వెబ్‌సైట్: http//tgobmms.cgg.gov.in/
News March 31, 2025
రూ.2వేల కోట్ల ఆస్తి పన్ను.. GHMC రికార్డ్

TG: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. 2024-25కు గాను రూ.2,012 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. GHMC చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం కింద రూ.465 కోట్లు వసూలైందని చెప్పారు.