News November 9, 2024
భారత్ ఆల్‌రౌండ్ షో.. సౌతాఫ్రికాపై విజయం

సౌతాఫ్రికాతో తొలి T20లో భారత్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో అదరగొట్టింది. దీంతో 61 రన్స్ తేడాతో విజయం సాధించింది. 203 టార్గెట్‌తో బరిలోకి దిగిన SAను 141 రన్స్‌కే కట్టడి చేసింది. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు తీసి SA పతనాన్ని శాసించారు. అవేశ్ ఖాన్ 2, అర్ష్‌దీప్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో భారత్ 4 టీ20ల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది.
Similar News
News February 20, 2026
భారత పర్యటనకు షకీరా

గ్లోబల్ పాప్ ఐకాన్, గ్రామీ అవార్డ్ విన్నర్ షకీరా ఇండియా పర్యటనకు రానున్నారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ‘ఫీడింగ్ ఇండియా’ నిర్వహించే కాన్సర్ట్‌లలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఏప్రిల్ 10, 15 తేదీల్లో ముంబై, ఢిల్లీలో ఈవెంట్స్ జరగనున్నాయి. దీనిద్వారా వచ్చే డబ్బులను పోషకాహార లోపంతో బాధపడే పిల్లల కోసం వెచ్చించనున్నారు. షకీరా చివరిసారిగా 2007లో ముంబైకి వచ్చారు.
News February 20, 2026
సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

సౌత్ ఇండియన్ బ్యాంక్‌లో జూనియర్ ఆఫీసర్/బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీతో పాటు పనిఅనుభవం గలవారు నేటి నుంచి మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఏడాది రూ.7.56లక్షలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: recruit.southindianbank.bank.in
News February 20, 2026
రైల్వేలో 11,127 ఉద్యోగాలు

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్(ALP) పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. సౌత్ సెంట్రల్ రైల్వేలో 674 ఉద్యోగాలున్నాయి. ఈ నెలాఖరులో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. టెన్త్, ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://indianrailways.gov.in/


