News April 24, 2025
భారత్ ఆరోపణలు.. పాక్ ప్రధాని రేపు కీలక భేటీ

పహల్‌గామ్ ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని దాయాది దేశంపై భారత్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో విజయవంతంగా ఎన్నికల నిర్వహణ, ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న వేళ దాడులకు పాల్పడినట్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మహమ్మద్ షెహబాజ్ షరీఫ్ రేపు నేషనల్ సెక్యూరిటీ కమిటీ మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి ఇసాక్ దార్ తెలిపారు. భారత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తారన్నారు.
Similar News
News April 24, 2025
నేటి నుంచి అప్పన్న నిజరూప దర్శన టికెట్లు

సింహాచలంలో ఈ నెల 30న అప్పన్నస్వామి నిజరూప దర్శనం, చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు టికెట్ల(రూ.300, రూ.1,000) విక్రయాలు ఇవాళ్టి నుంచి ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. ఆన్‌లైన్‌లో www.aptemples.ap.gov.in ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో సింహాచలం పాత పీఆర్వో ఆఫీస్, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉంటాయి.
News April 24, 2025
దేశీయ HPV కిట్లు త్వరలో విడుదల: జితేంద్ర

సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన <<15380344>>HPV<<>> కిట్లను త్వరలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అందుబాటు ధరలో టీకాలు, టెస్టులు, ట్రీట్‌మెంట్ చేయడమనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ‘సర్వైకల్’ మృతుల్లో 25% INDలోనే నమోదవుతున్నాయని చెప్పారు. చికిత్స ఆలస్యమవడం వల్లే ఇలా జరుగుతోందని, వైద్య సేవల అందించడానికి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావాలని కోరారు.
News April 24, 2025
వెంకటేశ్‌తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ మే 2న ప్రారంభమవుతుందని హీరో నాని తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత సుజీత్‌తో చిత్రం ఉంటుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వెంకటేశ్, నేను హీరోలుగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అలాగే శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు’ అని పేర్కొన్నారు.