News December 7, 2024
ఇక ఇండియా కూటమికి కాలం చెల్లినట్టేనా..!

INDIA కూటమి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్‌కు దూరమవుతున్నాయి. మమతకు బాధ్యతలు ఇవ్వాలని SP పట్టుబడుతోంది. అదానీ వ్యవహారంలో INC ఆందోళనలకు SP, TMC దూరంగా ఉన్నాయి. ఆప్ ఇప్పటికే ఢిల్లీలో దూరం జరిగింది. MH, హరియాణాలో తమను లెక్కలోకి తీసుకోలేదని వామపక్షాలు గుర్రుగా ఉన్నాయి. లాలూ ప్రసాద్‌కు బాధ్యతలు ఇవ్వాలని అటు RJD కోరుతోంది. మీ అభిప్రాయమేంటి?
Similar News
News January 7, 2026
తుఫాన్ల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ

AP: తరచూ తుఫాన్లు వచ్చి రాష్ట్రానికి ఎంతో నష్టం చేస్తున్నాయి. ఆ విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులు చేపట్టనుంది. ఇందులో భాగంగా తీరప్రాంతంలో 5 కి.మీ. వెడల్పున మాంగ్రూవ్స్, సరుగుడు, ఈత చెట్లు నాటుతారు. జనవరి నెలాఖరు నాటికి క్లియర్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు.
News January 7, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం సోదరుడికి సిట్ పిలుపు

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులిచ్చింది. గతంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రేపు ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని సూచించారు.
News January 7, 2026
మొలతాడు కట్టుకోవడం వెనుక సైన్స్ ఇదే..

మొలతాడు కట్టుకోవడం వెనుక శాస్త్రీయ, ఆరోగ్య కారణాలున్నాయి. ఇది శరీరంలోని అవయవాల పెరుగుదలను క్రమబద్ధంగా ఉంచుతుంది. హెర్నియా వంటి సమస్యలను రాకుండా అడ్డుకుంటుంది. నడుం చుట్టూ ఉండే నరాలపై ఒత్తిడి కలిగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని శక్తిని వృథా కాకుండా కాపాడుతుందని నమ్ముతారు. నలుపు, ఎరుపు రంగు దారాలు దిష్టి తగలకుండా రక్షణ కవచంలానూ పనిచేస్తాయి. వెండి మొలతాడు ఆరోగ్యాన్ని ఇస్తుందని నమ్మకం.


