News December 22, 2024
భారత్ భారీ స్కోరు
వెస్టిండీస్‌పై T20 సిరీస్ గెలిచి ఊపు మీదున్న భారత మహిళల జట్టు తొలి వన్డేలో అదే జోరును కొనసాగిస్తోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 314 రన్స్ చేసింది. ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన 91 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్నారు. హర్లీన్(44), ప్రతీక(40), హర్మన్ ప్రీత్(34) ఫర్వాలేదనిపించారు. విండీస్ బౌలర్లలో జేమ్స్ 5, మాథ్యూస్ 2 వికెట్లు తీశారు. WI టార్గెట్ 315.
Similar News
News December 23, 2024
రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ క్లారిటీ
నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై పేసర్ ఆకాశ్ దీప్ క్లారిటీ ఇచ్చారు. ‘నెట్స్‌లో రోహిత్ మోకాలికి బంతి బలంగా తాకింది. నొప్పితో ఆయన కాసేపు విలవిల్లాడారు. ఆ తర్వాత ఐస్ ప్యాక్ పెట్టుకుని అరగంటపాటు రెస్ట్ తీసుకున్నారు’ అని ఆయన చెప్పారు. కాగా ఈ నెల 26న భారత్, ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు ప్రారంభం కానుంది.
News December 23, 2024
పరిపాలనా వైఫల్యానికి నిదర్శనం: హరీశ్ రావు
TG: అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్ల దాడి ఘటన పూర్తిగా పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని హరీశ్ రావు ట్వీట్ చేశారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న CM రేవంత్ అడుగంటుతున్న శాంతిభద్రతల పట్ల తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గడిచిన ఒక్క ఏడాదిలోనే HYDలో 35,994 క్రైమ్ కేసులు నమోదుకావడం ఘోరమైన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యాల్లో శాంతి భద్రతలు లేవనే విషయం స్పష్టమవుతోందని చెప్పారు.
News December 23, 2024
పడుకునే ముందు తింటున్నారా?
రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు భోజనం కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ మందగించడం, గుండెల్లో మంట, నిద్ర లేమి, ఊబకాయం సమస్యలు వేధిస్తాయి. ఇది గుండెజబ్బులు, షుగర్ ప్రమాదం పెంచుతుంది. రాత్రి తిన్న 3 గంటల తర్వాత పడుకోవాలి. ఏదీ అధిక పరిమాణంలో తీసుకోకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్రపోవాలి.