News April 9, 2025
బంగ్లాదేశ్‌కు భారత్ దెబ్బ

బంగాళాఖాతానికి తామే పరిరక్షకులం అని బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చైనాలో చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ దేశానికి ఉన్న ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ తమ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఇక నుంచి భారత రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలను వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా పోటీ తగ్గి భారత ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరనుంది.
Similar News
News December 9, 2025
సంజూకు మళ్లీ నిరాశేనా!

SAతో వన్డేల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు T20ల్లోనూ మొండిచేయి ఎదురయ్యే ఆస్కారముంది. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్య జట్టుతో చేరనున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు. దీంతో అభిషేక్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్‌గా జితేశ్‌ను తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11.. సూర్య(C), గిల్(VC), అభిషేక్, తిలక్, పాండ్య, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్, కుల్దీప్
News December 9, 2025
సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్లైన్లోనే: CM

AP: ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ సంక్రాంతి నుంచి ఆన్లైన్లోనే అందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. RTGSపై సమీక్షలో మాట్లాడుతూ ‘వాట్సాప్ గవర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. రిజిస్ట్రేషన్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలి. RTC బస్టాండ్లు, టాయ్లెట్ల వద్ద పరిశుభ్రతను మెరుగుపర్చాలి. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలి’ అని సూచించారు.
News December 8, 2025
GHMCలో వార్డుల సంఖ్య రెట్టింపు

TG: GHMCలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.


