News March 27, 2024

మహారాష్ట్రలో ఇండియా కూటమిలో చిచ్చు!

image

NDAను పడగొట్టడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమికి సీట్ల పంపకం తలనొప్పిగా మారింది. తాజాగా మహారాష్ట్రలో శివసేన (UBT), కాంగ్రెస్ మధ్య రచ్చ మొదలైంది. శివసేన 17 స్థానాల అభ్యర్థులను ప్రకటించుకోవడమే ఇందుకు కారణం. 48 స్థానాల్లో తాము 22 చోట్ల పోటీ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా శివసేన నడుచుకుంటోందని విమర్శిస్తున్నారు.

Similar News

News March 31, 2026

విమాన ఇంధనంపై వ్యాట్ తగ్గించండి.. రాష్ట్రాలకు లేఖ!

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధర బ్యారెల్ $99.40 నుంచి $195.19కి చేరింది. కంపెనీలు రేపు ఈ రేట్లను మరోసారి సవరించనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసినట్లు సమాచారం. ‘ఢిల్లీలో VAT 25%, మహారాష్ట్రలో 18%, TNలో 29% ఉంది. వీటిని తగ్గిస్తే విమాన టికెట్లపై భారం పడదు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

News March 31, 2026

జిగ్‌జాగ్ కెరీర్.. ఇప్పుడిదే కావాలి గురూ!

image

చదివింది ఒకటి.. చేస్తున్న జాబ్ మరొకటి. చాలామంది ఇలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. అలాగే ఓ రంగానికి చెందిన ఉద్యోగంలో చేరి ఇతర వాటిల్లోకి మారేదే జిగ్‌జాగ్ కెరీర్. AI యుగంలో ఏ కంపెనీలోనూ ఉద్యోగం పర్మనెంట్ కాదు. అందుకే కంపెనీలకు తగ్గట్టు అప్డేట్ అవుతుంటే ఎలాంటి సందర్భంలోనైనా రాణించవచ్చు. జిగ్‌జాగ్ కెరీర్ అంటే ఏ పనికైనా ఫ్లెక్సిబుల్‌గా మారడమేనని నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరూ సిద్ధంగా ఉన్నారా?

News March 31, 2026

రేపు పార్లమెంటు ముందుకు ‘అమరావతి బిల్లు’

image

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ సవరణ <<19497807>>బిల్లు<<>>ను కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ‘ది ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ (అమెండ్మెంట్) బిల్,2026’ పేరుతో ఈ బిల్లును రూపొందించారు. లోక్‌సభ రేపటి బిజినెస్ లిస్టులో దీన్ని చేర్చారు. AP శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ ఈనెల28న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం తెలిసిందే. లోక్‌సభ రేపే దీన్ని ఆమోదించనుందని సమాచారం.