News September 17, 2024
ఇరాన్ సుప్రీం లీడర్‌కు భారత్ కౌంటర్

భారత్, గాజా, మయన్మార్ వంటి దేశాల్లో ముస్లింల పరిస్థితిని ఉద్దేశించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన వ్యాఖ్యలను స్వీకరించబోమని విదేశాంగ శాఖ Xలో ట్వీట్ చేసింది. మైనార్టీలను ఉద్దేశించి మాట్లాడే దేశాలు తమ దేశంలోని పరిస్థితులను ముందుగా పరిశీలించుకోవాలని చురకలు అంటించింది.
Similar News
News January 23, 2026
కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు: బండి సంజయ్

TG: కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఎన్నో అక్రమాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అయినా ఆ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఢిల్లీకి ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో సాగదీస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనడానికి అన్ని ఆధారాలున్నా KCR కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
News January 23, 2026
కల్తీనెయ్యి.. ఛార్జిషీట్లో కీలక అంశాలు..

తిరుమలకు 2019-24లో కల్తీనెయ్యి సరఫరా అయినా TTD అడ్డుకోలేదని నెల్లూరు కోర్టులో ఇవాళ దాఖలు చేసిన ఫైనల్ ఛార్జిషీట్లో CBI పేర్కొంది. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన నందిని డెయిరీ అంతకుముందు నెయ్యి సరఫరా చేయగా.. తగిన సామర్థ్యం, అనుభవం లేని AR డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. అటు ARకు ఇచ్చినా తెరవెనక భోలేబాబా సబ్ కాంట్రాక్ట్ పొంది నెయ్యి సప్లై చేసిందని దర్యాప్తు సంస్థ తెలిపింది.
News January 23, 2026
వరల్డ్ కప్‌కు రోహిత్ కెప్టెన్సీ? మాజీ క్రికెటర్ రెస్పాన్స్ ఇదే..

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఫెయిల్ అవుతున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. గిల్ నాయకత్వంలో AUS, NZతో జరిగిన సిరీస్‌లను భారత్ కోల్పోవడంతో అతణ్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2027 వరల్డ్ కప్ కోసం మళ్లీ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించాలని BCCIకి సూచించారు. రోహిత్ ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, ఈ మార్పు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు.


