News January 27, 2025

రూ.1.5 లక్షల కోట్ల వ్యయంతో భారత్ డ్యామ్ నిర్మాణం.. ఎక్కడంటే?

image

అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ నదిపై రూ.1.5 లక్షల కోట్ల ఖర్చుతో హైడ్రోపవర్ డ్యామ్ నిర్మించాలని భారత్ ప్రణాళిక రచిస్తోంది. సరిహద్దుల్లో చైనాకు కౌంటర్ ఇచ్చేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీని నిల్వ సామర్థ్యం సుమారు 9.2 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఉండొచ్చని అంచనా. పూర్తైతే వ్యూహాత్మకంగానూ భారత్‌కు ఇది లాభించనుంది. అయితే, డ్యామ్ నిర్మాణాన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.

Similar News

News November 26, 2025

సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: నిరంతర శ్రమ, సరైన నిర్ణయాలు తీసుకుంటే అనుకున్నది సాధించగలమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఎక్కడా తడబడకుండా మాక్ అసెంబ్లీలో చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే కష్టపడాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.

News November 26, 2025

IIIT-నాగపుర్‌లో ఉద్యోగాలు

image

<>IIIT<<>>-నాగపుర్‌ 6 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీటెక్, బీఈ, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం పీహెచ్‌డీ ఉన్నవారికి రూ.65వేలు, మిగతావారికి రూ.60వేలు చెల్లిస్తారు. దరఖాస్తు చేసిన తర్వాత కాపీని recruitment@iiitn.ac.in ఈమెయిల్‌కు పంపాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iiitn.ac.in.

News November 26, 2025

టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం

image

AP: ఇటీవల ఉదయ్‌పూర్‌లో అట్టహాసంగా కూతురి పెళ్లి చేసిన బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కూతురు నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9కోట్లు ఇచ్చినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చారు.