News October 27, 2024
భారత్ ఓటమి
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 76 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ డివైన్(79), సుజీ బేట్స్(58) రాణించడంతో 259 పరుగులు చేసింది. ఛేదనలో భారత్ టాపార్డర్ విఫలమవ్వడంతో 183 పరుగులకే ఆలౌటైంది. జట్టులో రాధా యాదవ్(48) టాప్ స్కోరర్. NZ విజయంతో సిరీస్ సమమైంది. కాగా సిరీస్ విజేతను నిర్ధారించే మూడో వన్డే 29న జరగనుంది.
Similar News
News January 3, 2025
ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TG: సమ్మె చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 24 రోజులుగా వారు విధులకు రాకపోవడాన్ని సీరియస్‌గా తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించడం లేదా విద్యాశాఖలో విలీనం చేయడం న్యాయపరంగా కుదరదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విధులకు హాజరుకాకుండా సమ్మె చేస్తున్న వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
News January 3, 2025
నేటి నుంచి నుమాయిష్
TG: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నేటి నుంచి నుమాయిష్ ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది నుమాయిష్‌లో 2వేల స్టాల్స్‌ను సొసైటీ ఏర్పాటు చేయనుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. వీకెండ్స్‌లో మరో గంట అదనపు సమయం కేటాయించారు. ప్రవేశ రుసుము రూ.50.
News January 3, 2025
మహా కుంభమేళాకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
ఉత్తర్ ప్రదేశ్‌లో జనవరి 14 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు 26 అదనపు రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. వచ్చే నెల 5 నుంచి 27 వరకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి యూపీ మధ్య నడవనున్నాయి. గుంటూరు, మచిలీపట్నం, కాకినాడ నుంచి వెళ్లే రైళ్లు వరంగల్, రామగుండం మీదుగా వెళ్లనున్నాయి.