News December 11, 2024

భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 298 పరుగులు చేసింది. ఆ జట్టులో అన్నాబెల్(110) సెంచరీతో చెలరేగారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీశారు. ఛేదనలో స్మృతి మంధాన(105) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. AUS బౌలర్ గార్డ్‌నర్ 5 వికెట్లు తీసి పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.

Similar News

News November 28, 2025

SRCL: మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మొదటి విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఇన్‌ఛార్జ్ కలెక్టర్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు పాల్గొన్నారు.

News November 28, 2025

DEC 13న HYDకు మెస్సీ: CM రేవంత్

image

TG: తన G.O.A.T. టూర్‌ లిస్టులో హైదరాబాద్ కూడా యాడ్ అయ్యిందని ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. ‘డిసెంబర్ 13న హైదరాబాద్‌కి మెస్సీని స్వాగతించేందుకు ఎదురు చూస్తున్నాను. మా గడ్డ మీద మీలాంటి ఫుట్‌బాల్ స్టార్‌ని చూడాలని కలలుగన్న ప్రతి అభిమానికి ఇది ఎగ్జైటింగ్ మూమెంట్. మీకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సగర్వంగా సిద్ధమైంది’ అని ట్వీట్ చేశారు.

News November 28, 2025

భారత్ తగ్గేదే లే.. GDP వృద్ధి రేటు 8.2%

image

భారత జీడీపీ అంచనాలను మించి రాణించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2%గా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 5.6%గా ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఈ నంబర్లను రిలీజ్ చేసింది. అమెరికా టారిఫ్స్ విధించినా భారత ఆర్థిక రంగం మెరుగ్గా రాణించడం విశేషం.