News August 29, 2025
GDPలో భారత్ తగ్గేదేలే

GDPలో భారత్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో ఇండియన్ ఎకానమీ 7.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది తొలి త్రైమాసికంలో ఇది 6.7%గా ఉంది. రియల్ జీడీపీ రూ.47.89 లక్షల కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.44.42 లక్షల కోట్లుగా ఉంది. నామమాత్రపు జీడీపీ రూ.86.05 లక్షల కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో రూ.79.08 లక్షల కోట్లుగా నమోదైంది.
Similar News
News August 29, 2025
ఒకేసారి 5 ఉద్యోగాలు కొట్టిన ‘అమ్మ’

AP: శ్రీకాకుళం జిల్లాకు చెందిన మహిళ ఒకేసారి 5 ఉద్యోగాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సరుబుజ్జిలి(M) మతలబుపేటకు చెందిన చింతా రాధాకుమారి-కేఎల్ నాయుడుకు ఇద్దరు పిల్లలు. ఎప్పటికైనా టీచర్ కావాలనే ఆశయంతో సంసారాన్ని నడిపిస్తూనే రాధ MA, లాంగ్వేజ్ పండిట్ కోర్స్, TTC, B.Ed పూర్తి చేశారు. ఇటీవల ప్రకటించిన DSCలో SGT-14, SA తెలుగు-23, SA సోషల్-39, TGT తెలుగు-113,TGT సోషల్‌లో 77వ ర్యాంక్ సాధించారు.
News August 29, 2025
భారత మహిళా క్రికెటర్లతో లోకేశ్

AP: క్రీడలను ప్రోత్సహించడానికే 3% స్పోర్ట్స్ కోటా అమలు చేయాలని నిర్ణయించామని మంత్రి లోకేశ్ తెలిపారు. విశాఖలో ‘బ్రేకింగ్ బౌండరీస్ విత్ లోకేశ్’ పేరిట భారత మహిళా క్రికెటర్లతో ముఖాముఖిలో పాల్గొన్నారు. క్రీడలను ప్రోత్సహించడంలో చంద్రబాబుకు ప్రత్యేకమైన చరిత్ర ఉందని, ఉమ్మడి ఏపీలో ఏషియన్ గేమ్స్ నిర్వహించారని చెప్పారు. ఈ ప్రోగ్రాంలో మిథాలీ రాజ్, స్మృతి మందాన, దీప్తి శర్మ, శృతి తదితరులు పాల్గొన్నారు.
News August 29, 2025
శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ.. జింబాబ్వేకు హార్ట్ బ్రేక్

జింబాబ్వేతో తొలి వన్డేలో శ్రీలంక థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. ఆ జట్టుపై 7 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక 50 ఓవర్లలో 298/6 పరుగులు చేసింది. నిస్సాంక(76), లియనగే(70*) రాణించారు. ఛేదనలో జింబాబ్వే 291/8 పరుగులు చేసి పోరాడి ఓడింది. సికందర్ రజా(92) ఒంటరి పోరాటం చేశారు. చివరి ఓవర్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా శ్రీలంక బౌలర్ మధుశంక హ్యాట్రిక్ వికెట్లు తీసి, 2రన్సే ఇచ్చారు.