News May 21, 2024

USలో ఇండియా ‘జనరిక్స్’దే హవా

image

తక్కువ ధరకు జనరిక్ మందుల సరఫరాలో భారత కంపెనీలు సత్తా చాటుతున్నాయి. 2022లో USలోని రోగులు వినియోగించిన మొత్తం జనరిక్స్‌లో 47% మన కంపెనీలవే. మానసిక రుగ్మతలు, హైపర్ టెన్షన్, లిపిడ్ రెగ్యులేటర్స్, యాంటీ అల్సర్స్, డయాబెటిస్ సంబంధ మందులు ఎక్కువగా వాడుతున్నారట. దీనివల్ల 2022లో US హెల్త్ డిపార్ట్‌మెంట్ 219 బిలియన్ డాలర్లు ఆదా చేయగలిగింది. 2013-2022 మధ్య ఏకంగా 1.3 ట్రిలియన్ డాలర్లను పొదుపు చేసింది.

Similar News

News December 1, 2025

చైనాలో నిరుద్యోగం.. సివిల్స్ పరీక్షకు పోటెత్తిన అభ్యర్థులు

image

చైనాలో సివిల్స్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. అర్హత వయసు 35 నుంచి 38 ఏళ్లకు పెంచడంతో ఏకంగా 37 లక్షల మంది పరీక్ష రాశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పెరిగిందని తెలుస్తోంది. ఒక్కో పోస్టుకు 98 మంది పోటీ పడుతున్నారు. మొత్తం పోస్టుల్లో 70% కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి కేటాయించారు. చైనాలో ఏటా 1.2 కోట్ల మంది డిగ్రీ పూర్తి చేస్తున్నారు.

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

News December 1, 2025

ఇవాళ సమంత పెళ్లి అంటూ ప్రచారం

image

హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ రాజ్ నిడిమోరును ఆమె ఇవాళ కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకుంటారని పలు కథనాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు సమంత, రాజ్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన లేదు. కాగా ‘తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు’ అని రాజ్ మాజీ భార్య శ్యామలిదే చేసిన పోస్ట్ ఈ ప్రచారానికి ఊతమిస్తోంది.