News April 28, 2024
చరిత్ర సృష్టించిన భారత ఆర్చరీ జట్టు

ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చైనాలో జరుగుతున్న WC స్టేజ్ 1లో ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్‌లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు బంగారు పతకాన్ని సాధించింది. ఒలింపిక్ ఛాంపియన్ దక్షిణ కొరియాను 5-1తేడాతో మట్టికరిపించింది. 14 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడ్డాయి.
Similar News
News October 16, 2025
నేడు ప్రధాని మోదీ పర్యటన.. స్కూళ్లకు సెలవులు

AP: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేడు PM మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించారు. మోదీ 9.55AMకు కర్నూలు చేరుకుంటారు. అక్కడ్నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఉ.9 గం.-మ.2గం. వరకు శ్రీశైలంలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. 2.20PMకు కర్నూలు చేరుకుని GST సభలో ప్రసంగిస్తారు.
News October 16, 2025
శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న నాలుగో ప్రధాని మోదీ

AP: ప్రధాని మోదీ ఇవాళ శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్నారు. గతంలో ఆ హోదాలో జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు నాలుగో ప్రధానిగా మోదీ వస్తున్నారు. భారత వాయుసేన విమానంలో ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు కర్నూలు, అక్కడి నుంచి సైనిక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారు. అటు మోదీకి స్వాగతం పలికేందుకు కర్నూలు నగరం ముస్తాబైంది.
News October 16, 2025
దైవ నామాన్ని ఎప్పుడు స్మరిస్తే ఏ ఫలితం ఉంటుంది?

కార్య సాధనలో దైవ నామ స్మరణ గొప్ప ఫలితాలను ఇస్తుంది. నడుస్తూ దేవుడి పేరును జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. వంట చేసే సమయంలో దైవ నామస్మరణ చేస్తే ఆహారం మహా ప్రసాదంగా మారుతుంది. స్నానం చేసేటప్పుడు దేవుడి పేరును తలుచుకుంటే ఆ స్నానం తీర్థ స్నానంతో సమానమవుతుంది. నిద్రించే ముందు దేవుని ధ్యానం చేస్తే అది ధ్యాన నిద్రగా మారుతుంది. మనం నివసించే ఇంట్లోనే దైవాన్ని స్మరిస్తే ఆ ఇల్లే పవిత్ర దేవాలయంగా మారుతుంది.