News March 23, 2025
భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం: జైశంకర్

అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల్లో వాణిజ్య ఒప్పందాలు కీలకమైనవని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం ఐరోపా, US, UK, న్యూజిలాండ్‌తో ట్రేడ్ చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఇకపై భారత ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం అనే విధానాన్ని అనుసరిస్తామని చెప్పారు. గతంలో ఆసియా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యం పోటాపోటీగా జరిగిందన్నారు. అయితే గల్ఫ్, పశ్చిమ దేశాలతో ఒప్పందాల్లోనే ఆర్థికంగా మిగులు సాధించినట్లు వివరించారు.
Similar News
News December 19, 2025
ఉపాధి హక్కును రేషన్ స్కీమ్‌గా మార్చారు: రాహుల్ గాంధీ

పేదల డిమాండ్లు, హక్కుల ఆధారంగా ఉన్న 20ఏళ్ల MGNREGA పథకాన్ని మోదీ ప్రభుత్వం ఒక్కరోజులో మార్చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ Xలో మండిపడ్డారు. కొత్త VB-G RAM G చట్టాన్ని కేంద్రం నియంత్రణలో ఉండే రేషన్ స్కీమ్‌గా అభివర్ణించారు. దీనివల్ల మహిళలు, దళితులు, ఆదివాసీలకు ఉపాధి దూరమవుతుందన్నారు. సరైన స్క్రూటినీ లేకుండా పార్లమెంట్ ద్వారా మరో స్కీమ్‌ను తీసుకొచ్చారన్నారు.
News December 19, 2025
అవతార్-3 రివ్యూ&రేటింగ్

పండోరా గ్రహంలోనే స్థిరపడిన జేక్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి చేసే పోరాటమే అవతార్-3(ఫైర్&యాష్). జేమ్స్ కామెరూన్ ఎప్పటిలాగే మరోసారి తెరపై విజువల్ వండర్ క్రియేట్ చేశారు. ట్రైబల్ విలన్‌గా ఊనా చాప్లిన్ చేసిన ‘వరాంగ్’ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, రొటీన్ స్క్రీన్ ప్లే, నిడివి(3H 17M) మైనస్. BGM ఫర్వాలేదు. తొలి 2 పార్టులతో పోలిస్తే నిరాశపరుస్తుంది.
రేటింగ్: 2.25/5
News December 19, 2025
పోలవరం పెండింగ్ అనుమతులివ్వండి: చంద్రబాబు

AP: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, వివిధ పథకాలకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జల శక్తి మంత్రి CR పాటిల్‌ను CM చంద్రబాబు కోరారు. ఇవాళ ఢిల్లీలో పాటిల్‌తో గంటపాటు భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ అనుమతులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించేలా కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలని చూస్తోందని, భూసేకరణకు సిద్ధమైందని కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు.


