News October 15, 2024

అమెరికాతో భార‌త్‌ కీల‌క ఒప్పందం

image

స‌రిహ‌ద్దుల్లో నిఘా వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌త‌కు అమెరికా నుంచి 31 ప్రిడేట‌ర్ MQ-9B డ్రోన్ల కొనుగోలుకు భార‌త్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేర‌కు ఇరు దేశాలు ఒప్పందంపై మంగ‌ళ‌వారం సంత‌కాలు చేశాయి. గ‌త నెల అమెరికా ప‌ర్య‌ట‌నలో ఆ దేశాధ్య‌క్షుడు బైడెన్‌తో ప్ర‌ధాని మోదీ ఇదే విష‌య‌మై చ‌ర్చించారు. డ్రోన్ల కొనుగోలు స‌హా నిర్వ‌హ‌ణ‌, మ‌ర‌మ్మ‌తుల వ్యవ‌స్థ ఏర్పాటుకు ఒప్పందాలు జ‌రిగాయి. ఈ ఒప్పందం విలువ రూ.34,500 కోట్లు.

Similar News

News October 15, 2024

రజినీ సినిమాలో ఛాన్స్ నిరాకరించిన నాని?

image

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’లో నటించే అవకాశాన్ని హీరో నాని వదులుకున్నట్లు తెలుస్తోంది. ఆ మూవీలో ఫహాద్ ఫాజిల్ నటించిన దొంగ పాత్రకు తొలుత నానినే మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. సినిమాలో ఆ పాత్రకు బరువు లేదని భావించి, నాని నిరాకరించారని టాక్. వేట్టయన్‌లో రానా, అమితాబ్ తదితరుల పాత్రలకూ సరైన ప్రాముఖ్యత లభించలేదు. దీంతో నాని నిర్ణయం కరెక్టేనంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

News October 15, 2024

DOPT ఉత్తర్వులు పాటించాల్సిందే.. క్యాట్ తీర్పు

image

తమను APకి వెళ్లాలంటూ DOPT జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని తెలంగాణలో పనిచేస్తున్న IASలు వేసిన పిటిషన్‌పై CAT కీలక తీర్పునిచ్చింది. వారు ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఐఏఎస్‌ల విజ్ఞప్తిని తిరస్కరించింది. రేపు యథావిధిగా ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. దీంతో వాకాటి అరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రోస్ ఏపీకి వెళ్లాల్సి ఉంటుంది.

News October 15, 2024

స్నేహితుడి హత్య.. సల్మాన్‌కు భద్రత పెంపు

image

రాజకీయ నేత బాబా సిద్ధిఖీ <<14343654>>హత్య నేపథ్యంలో<<>> బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ భద్రతను Y+ కేటగిరీకి ప్రభుత్వం పెంచింది. ఆయన భద్రతపై ఆందోళనలు నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వెళ్లిన సమయంలో పోలీస్ ఎస్కార్ట్‌ వెంట ఉండనుంది. బీజేపీ ఎంపీ, హీరోయిన్ కంగనా రనౌత్ కూడా Y+ సెక్యూరిటీ కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో ఇద్దరు PSOలతో పాటు 11 మంది సిబ్బందిని భద్రతగా కేటాయిస్తారు.