News April 14, 2024
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై భారత్ కీలక ప్రకటన

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక ప్రకటన చేసింది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. దౌత్యపరమైన చర్చలతో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది. తక్షణమే హింసను విడనాడాలని కోరింది. యుద్ధ పరిస్థితిని భారత్ నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది.
Similar News
News April 2, 2026
ఏప్రిల్ 2: చరిత్రలో ఈరోజు

* 1942: గణిత శాస్త్రవేత్త వశిష్ఠ నారాయణ సింగ్ జననం
* 1969: బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ జననం
* 1872: టెలిగ్రాఫ్ ఆవిష్కర్త సామ్యుల్ మోర్స్ మరణం
* 1933: క్రికెటర్ మహారాజా రంజిత్ సింహ్‌జీ మరణం (ఫొటోలో)
* 2011: వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ విజయం
* అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
* వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే
News April 2, 2026
పాక్ కాళ్ల బేరానికి రావడంతో ఆపేశాం.. లేదంటేనా: నేవీ చీఫ్

ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ పాత్రపై చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మరికొన్ని నిమిషాల్లో నేవీ పాక్ తీరప్రాంతంపై భారీ దాడులతో విరుచుకుపడనుందనగా ఆ దేశం కాళ్లబేరానికి వచ్చిందన్నారు. వెంటనే దాడులు ఆపాలని వేడుకోవడంతో వ్యూహాలను విరమించుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌లో సేవలకుగాను నేవీ అధికారులకు యుద్ధ్ సేవా మెడల్స్ ప్రదానం సందర్భంగా చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
News April 2, 2026
చరణ్ అన్న సలహా కచ్చితంగా పాటిస్తా: నిహారిక

నిర్మాతగా నిలదొక్కుకోవాలంటే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని రామ్‌చరణ్ తనకు సలహా ఇచ్చారని మెగాడాటర్ నిహారిక చెప్పుకొచ్చారు. చరణ్ అన్న చెప్పిన ‘నెవర్ సే నెవర్’ రూల్ కచ్చితంగా పాటిస్తానని అన్నారు. ఇక అన్నయ్య వరుణ్ తేజ్ హీరోగా తాను నిర్మించనున్న <<19495867>>’బరి’<<>> సినిమా బడ్జెట్ ₹60కోట్లు అని వెల్లడించారు. దీంతో నిర్మాతగా నిహారిక కెరీర్‌లో ‘బరి’ హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిలవనుంది.


