News October 18, 2024

టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు

image

టెస్టు క్రికెట్ చరిత్రలో ఓ క్యాలెండర్ ఇయర్‌లో 100 సిక్సర్లు బాదిన జట్టుగా భారత్ నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు టీమ్ ఇండియా 102 సిక్సర్లు బాదింది. అంతకుముందు ఇంగ్లండ్(89-2022) పేరిట ఈ రికార్డు ఉంది. ఆ తర్వాతి స్థానంలోనే భారత జట్టు(81-2021) ఉండటం విశేషం.

Similar News

News February 10, 2026

టీ20 WCలో నేటి మ్యాచులు ఇవే

image

T20 వరల్డ్ కప్ రసవత్తరంగా సాగుతోంది. చిన్న జట్లు రాణిస్తుండటం పెద్ద టీమ్‌లకు సవాలుగా మారుతోంది. ఇవాళ 3 మ్యాచులు జరగనున్నాయి. 11am నుంచి నెదర్లాండ్స్vsనమీబియా (ఢిల్లీ), 3pm నుంచి NZvsUAE (చెన్నై), 7pm నుంచి PAKvsUSA (కొలొంబో) మ్యాచ్ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. కాగా 2024WCలో పాక్‌పై USA సూపర్ ఓవర్‌లో గెలిచిన నేపథ్యంలో నేటి మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశముంది.

News February 10, 2026

డికాక్ సరికొత్త రికార్డ్..

image

SA ప్లేయర్ డికాక్ సరికొత్త రికార్డు సృష్టించారు. అతి తక్కువ(28) T20WC మ్యాచ్‌లలో ఎక్కువ మంది(32)ని ఔట్(స్టంపింగ్/క్యాచ్) చేసిన కీపర్‌గా నిలిచారు. ఈ క్రమంలో ధోనీ(33 మ్యాచ్‌లలో 32 ఔట్లు) సరసన చేరారు. ఆ తర్వాతి స్థానాల్లో అక్మల్(30), దినేశ్ రామ్‌దిన్(27), సంగక్కర(26), బట్లర్(26) ఉన్నారు. బట్లర్ మినహా యాక్టివ్ ప్లేయర్లలో ఎవరూ ఇతనికి దరిదాపుల్లో లేరు. దీంతో ఈ WCలోనే ధోనీని వెనక్కినెట్టే అవకాశం ఉంది.

News February 10, 2026

US-బంగ్లా ట్రేడ్ డీల్.. 1 శాతం సుంకం తగ్గింపు!

image

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. టారిఫ్స్‌ను 20% నుంచి 19%కి అమెరికా కుదించింది. అంటే కేవలం 1% తగ్గించింది. నిజానికి బంగ్లా గూడ్స్‌పై 37% సుంకాలు విధించాలని మొదట్లో ప్రతిపాదించినా.. తర్వాత 20%కి తగ్గిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. తాజా డీల్‌తో US మెటీరియల్స్‌తో తయారు చేసిన పలు టెక్స్‌టైల్, అప్పెరల్ గూడ్స్‌కు జీరో టారిఫ్ యాక్సెస్ దొరుకుతుందని బంగ్లా అడ్వైజర్ యూనస్ ట్వీట్ చేశారు.