News March 20, 2025

భారత్‌కు సొంతంగా బ్రౌజర్!

image

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్‌కు ఇదో సదవకాశం. బ్రౌజర్‌కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.

Similar News

News March 22, 2025

సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు? నారాయణ

image

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు.

News March 22, 2025

బల్లులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

image

ఇంటి గోడలపై నెమలి ఈకలను అంటించండి. వెల్లుల్లి రిబ్బల్ని గదులలో ఉంచితే వాటి వాసనకు బల్లులు దూరంగా ఉంటాయి. ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి అవి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పెట్టండి. నల్ల మిరియాలను నీటిలో కలిపి గోడలపై స్ప్రే చేయాలి. గుడ్డు పెంకుల్ని బల్లులున్న ప్రదేశాల్లో ఉంచండి. నాప్తలీన్ గోలీల వాసన బల్లులకు పడదు. వీటితో పాటు ఇంటిలో బూజు చెత్త లేకుండా క్లీన్‌గా ఉంచండి. తద్వార బల్లులు రాకుండా ఉంటాయి.

News March 22, 2025

అక్రమ వలసదారుల డేటా ఇచ్చిన విదేశాంగ శాఖ

image

ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న కాలంలో 6వేల మందికి పైగా భారతీయులు వెనక్కి వచ్చారు. బైడెన్ కాలంలో ఈ సంఖ్య 3వేలుగా ఉంది. భారత్ నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారుల డేటాను విదేశాంగ శాఖ పార్లమెంటుకు అందజేసింది. 2009 నుంచి 2024 వరకు 15,564 మంది భారత్ కు తిరిగివచ్చారు. అయితే మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

error: Content is protected !!