News March 17, 2025

భారత్ ప్రగతి అద్భుతం: బిల్‌గేట్స్

image

ఆరోగ్యం, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ అద్భుత ప్రగతి సాధించిందని బిల్‌గేట్స్ అన్నారు. భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో దేశంపై ప్రశంసలు కురిపించారు. వాతావరణం, వ్యవసాయం, చీడపీడల బెడద తగ్గించడంలో ఏఐ సహాయం చేస్తుందన్నారు. గేట్స్ ఫౌండేషన్ 25వార్షికోత్సవానికి భారత్ అనువైన ప్రదేశమని తెెలిపారు. ఇండియాలో శాస్త్రవేత్తలు, అధికారులతో బిల్ గేట్స్ సమావేశమయ్యే అవకాశముంది.

Similar News

News November 22, 2025

కూలుతున్న ‘క్రిప్టో’.. భారీగా పతనం

image

ఆకాశమే హద్దుగా ఎగిసిన క్రిప్టోకరెన్సీ అంతే వేగంగా దిగివస్తోంది. కొన్నాళ్లుగా వాటి విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో రారాజు బిట్ కాయిన్ వాల్యూ ఈ నెలలో 25 శాతం పతనం కావడం గమనార్హం. 2022 జూన్ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో 1.10 లక్షల డాలర్లుగా ఉన్న విలువ నిన్న 7.6 శాతం తగ్గి 80,553 డాలర్లకు చేరింది. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల కంటే కిందికి పడిపోయింది.

News November 22, 2025

విభూతి మహిమ

image

ఓనాడు ఓ విదేశీయుడు శివాలయం వద్ద 2 విభూది ప్యాకెట్లు కొన్నాడు. వాటిని అమ్మే బాలుడితో దాని ఎక్స్‌పైరీ డేట్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు ‘విభూతికి ఏ గడువూ ఉండదు. దీన్ని మీరు రోజూ నుదిటిపై ధరిస్తే మీ ఎక్స్‌పైరీ డేట్ పెరుగుతుంది’ అని జవాబిచ్చాడు. సాక్షాత్తూ ఆ శివుడి ప్రసాదం అయిన విభూతికి నిజంగానే అంత శక్తి ఉందని నమ్ముతారు. విభూతి ధరిస్తే.. శివుని కృపకు పాత్రులవుతారని, ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.

News November 22, 2025

Al Falah: వందల మంది విద్యార్థుల భవిష్యత్తేంటి?

image

ఢిల్లీ పేలుడు <<18325633>>ఉగ్ర మూలాలు<<>> అల్ ఫలాహ్ వర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్ సహా పలువురు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వందల మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వర్సిటీ, కాలేజీల గుర్తింపులు రద్దయితే అంతా కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కెరీర్, NEET కష్టం, ₹లక్షల ఫీజులు వృథా అవుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఎక్కడా నమ్మరని బాధపడుతున్నారు.