News October 18, 2025
బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

భారతదేశపు బంగారం నిల్వల విలువ మొదటిసారిగా $100 బిలియన్ మైలురాయిని అధిగమించింది. మొత్తంగా $102 బిలియన్లు దాటినట్లు RBI డేటా పేర్కొంటోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పెరగడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దేశ ఆర్థిక స్థిరత్వానికి ఇదెంతగానో బలం చేకూర్చనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం RBI విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 14.7% కి చేరింది.
Similar News
News October 18, 2025
‘K RAMP’ సినిమా రివ్యూ&రేటింగ్

అల్లరి చిల్లరగా తిరిగే రిచ్ ఫ్యామిలీ యువకుడు కాలేజీలో తాను ప్రేమించిన యువతి కోసం ఏం చేశాడు? ఆమె ఎదుర్కొంటున్న సమస్య నుంచి ఎలా బయటపడేశాడన్నదే ‘K RAMP’ కథ. కిరణ్ అబ్బవరం నటన, అక్కడక్కడ కామెడీ సీన్లు, కొన్ని మాస్ అంశాలు ఆకట్టుకుంటాయి. పాటలు, BGM ఫర్వాలేదనిపిస్తాయి. కొత్తదనం లేని కథ, ఇరికించినట్లుగా ఉండే కామెడీ, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇబ్బందిపెడతాయి.
రేటింగ్: 2.25/5
News October 18, 2025
8,113 పోస్టులు.. ప్రైమరీ కీ విడుదల

8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి సంబంధించి సీబీటీ -2 పరీక్షల ప్రైమరీ కీని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్ పొందవచ్చు. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 23 వరకు తెలుపవచ్చు. ఈ నెల 13న RRB సీబీటీ -2 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
News October 18, 2025
ఘోర ప్రమాదం… 8 మంది భక్తుల మృతి

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్ వద్ద పికప్ వ్యాను లోయలో పడి 8మంది భక్తులు మరణించారు. ఇష్టదైవం అస్తంబా దేవీయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వ్యాను ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. వ్యాను తునాతునకలు కాగా భక్తులు వాహనం కింద పడిపోయారు. 8మంది అక్కడికక్కడే మరణించగా మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యంత వేగంతో వెళ్తూ డ్రైవర్ పట్టుకోల్పోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.