News December 15, 2024
పాకిస్థాన్‌పై భారత్ విజయం

మహిళల అండర్-19 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 67 పరుగులే చేసింది. భారత బౌలర్ సోనమ్ యాదవ్ 4 వికెట్లు తీశారు. ఛేదనలో భారత్ 73 బంతులుండగానే జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్ కమలిని 29 బంతుల్లో 44* పరుగులు చేశారు.
Similar News
News December 3, 2025
రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గ్రామపంచాయతీల్లో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్ ఉపసంహరణ గడువు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండటంతో రెబెల్స్‌ను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీల నేతలు ఉన్నారు. ‘ఈసారి తప్పుకో.. వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామంటూ’ ఆయా గ్రామ పంచాయతీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. అలాగే రహస్య సమావేశాలు జరుపుతూ పరస్పర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
News December 3, 2025
124 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(C<
News December 3, 2025
‘సంచార్ సాథీ’తో 7 లక్షల ఫోన్లు రికవరీ: PIB

<<18445876>>సంచార్ సాథీ<<>> గురించి వివాదం కొనసాగుతోన్న వేళ.. ఆ యాప్ గురించి PIB వివరించింది. ఈ ఏడాది జనవరి 17న ప్రారంభమైన ఈ యాప్‌నకు 1.4 కోట్లకుపైగా డౌన్లోడ్లు ఉన్నాయని పేర్కొంది. ఇప్పటివరకు 42 లక్షల దొంగిలించిన ఫోన్లను బ్లాక్ చేసి, 26 లక్షలకు పైగా మొబైల్‌లను ట్రేస్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో 7.23 లక్షల ఫోన్లు తిరిగి ఓనర్ల వద్దకు చేరాయని, యూజర్ల ప్రైవసీకి పూర్తి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది.


