News October 28, 2024

విదేశాలకు ఇండియా వెపన్స్.. NEXT టార్గెట్ ఇదే!

image

డిఫెన్స్ రంగంలో ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలను ఇస్తోంది. 2023-24లో భారత్ రూ.21,083 కోట్ల విలువైన ఆయుధాలను <<14471733>>ఎగుమతి<<>> చేసింది. ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లుగా ఉన్న డిఫెన్స్ ప్రొడక్షన్ 2028-29 నాటికి రూ.3 లక్షల కోట్లకు, ఎగుమతులు రూ.50వేల కోట్లకు పెంచాలని టార్గెట్‌గా పెట్టుకుంది. 16 PSUలు, 430 కంపెనీలు, 16000 SMEలతో ఇండస్ట్రీని విస్తరించింది. ప్రైవేటు కంట్రిబ్యూషన్‌ను 21%కు పెంచింది. దీనిపై మీ కామెంట్!

Similar News

News November 1, 2024

మస్క్.. మార్స్.. రాజకీయం

image

US ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం చేయడంపై ఎలాన్ మస్క్ స్పందించారు. ‘మార్స్‌పై మానవ కాలనీల స్థాపనకు మస్క్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు’ అని ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ.. ‘నిజమే. ట్రంప్ గెలిస్తే మార్స్‌పైకి చేరుకోవడంతోపాటు అక్కడ జీవనం, ప్రయోగాలకు వీలవుతుంది. అందుకే పాలిటిక్స్‌లో చురుగ్గా ఉంటున్నా’ అని రాసుకొచ్చారు.

News November 1, 2024

NPCIకి రాజీనామా.. MCX ఎండీగా ప్రవీణా రాయ్

image

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా COO ప్రవీణా రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్(MCX) MD, CEOగా బాధ్యతలు చేపట్టారు. ఈమె నియామకానికి ‘సెబీ’ ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఆమెకు 30ఏళ్ల అనుభవం ఉంది. కోటక్ మహీంద్రా, సిటీ బ్యాంక్, HSBC బ్యాంకుల్లో పని చేశారు. NPCIలో బిజినెస్ స్ట్రాటజీ, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షించారు.

News November 1, 2024

ఎవరు కావాలో మాకు తెలుసు: పార్థ్ జిందాల్

image

రిషభ్ పంత్‌ను DC అట్టిపెట్టుకోకపోవడం, జట్టు కూర్పుపై కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. ‘ఎవరు కావాలో మాకు తెలుసు. అనుభవం, యంగ్ ప్లేయర్ల కలయికతో అక్షర్, కుల్దీప్, స్టబ్స్, పొరెల్‌ను రిటైన్ చేసుకున్నాం. ఇందుకు హ్యాపీగానే ఉన్నాం. మాకు రెండు RTM కార్డులున్నాయి. గతంలో ఢిల్లీకి ఆడిన ఆటగాళ్లను కొనసాగించుకునే అవకాశం ఉంది. మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.