News October 17, 2024

భారత్ చెత్త రికార్డు

image

కివీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్సులో భారత్ 46 పరుగులకే చాపచుట్టేసింది. ఇది టీమ్ ఇండియాకు మూడో అత్యల్ప స్కోరు. 2020లో 36(vsAUS), 1974లో 42(vsENG) పరుగులకు ఆలౌటైంది. ఆయా టెస్టుల్లో థర్డ్ ఇన్నింగ్సులో లోయెస్ట్ స్కోరుకు కుప్పకూలగా, సొంత గడ్డపై తొలి ఇన్నింగ్సులో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. స్వదేశంలో ఒక ఇన్నింగ్సులో ఐదుగురు డకౌట్ కావడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి.

Similar News

News October 17, 2024

ఆ ప్లాంట్‌లో కోటి కార్లు ఉత్పత్తి చేశాం: మారుతి

image

హరియాణాలోని మానేసర్ ప్లాంట్‌ మొదలైనప్పటి నుంచి తమ సంస్థ అక్కడ కోటి కార్లను ఉత్పత్తి చేసిందని మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. కేవలం 18 ఏళ్లలోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొంది. గురుగ్రామ్, మానేసర్, గుజరాత్‌లో మారుతికి ఉత్పత్తి ప్లాంట్లున్నాయి. మానేసర్‌లో బ్రెజా, ఎర్టిగా, ఎక్స్‌ఎల్ 6, సియాజ్, డిజైర్, వాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో కార్లను తయారు చేసి భారత్‌తో పాటు విదేశాలకూ ఎగుమతి చేస్తోంది.

News October 17, 2024

కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని చాలా జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, యాదాద్రి, WGL, సూర్యాపేట, సిద్దిపేట, RR, కరీంనగర్, నల్గొండ, మెదక్, ఖమ్మం, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లో మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. కాగా ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

News October 17, 2024

గ్రూప్-1 మెయిన్స్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష

image

TG: గ్రూప్-1 పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎస్ శాంతకుమారి సూచించారు. గ్రూప్-1 పరీక్షకు ఏర్పాట్లను సమీక్షించారు. మెయిన్స్‌కు 34,383 మంది అభ్యర్థులు హాజరవుతారని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఆదేశించారు. మెయిన్స్ నిర్వహణకు 46 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ఠ బందోబస్తుతో పాటు విస్తృత పర్యవేక్షణ ఉండాలన్నారు.