News February 28, 2025
బంగ్లా పుస్తకాల్లో ఇందిర ఫొటోలు తొలగింపు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం తమ నూతన పాఠ్య పుస్తకాల్లో మార్పులు చేసింది. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటంలో సాయం చేసిన భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలను తొలగించింది. బంగ్లా నేత షేక్ ముజిబుర్ రెహమాన్ చిత్రాలనూ తీసివేసింది. కాగా పాక్ నుంచి బంగ్లాకు విముక్తి కల్పించేందుకు అప్పట్లో ఇందిరా విశేష కృషి చేశారు. ఇందుకు కృతజ్ఞతగా అక్కడి పుస్తకాల్లో చరిత్ర పుటల్లో నిలిచిపోయేలా ఇందిరా ఫొటోలను ముద్రించారు.
Similar News
News January 24, 2026
బ్యాంకు ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలం

సమ్మె విరమించుకోవాలని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంకు యూనియన్స్(UFBU)తో చీఫ్ లేబర్ కమిషనర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ప్రతినిధులతో గురు, శుక్రవారం చర్చలు జరిపినా వారి నుంచి సానుకూల స్పందన రాలేదని UFBU ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ముందు చెప్పిన విధంగా JAN 27న సమ్మెకు వెళ్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు(నాల్గవ శనివారం, ఆది, రిపబ్లిక్ డే, సమ్మె) పనిచేయవు.
News January 24, 2026
జిల్లేడు ఆకులు, రేగు పండ్ల వెనుక రహస్యమిదే..

రథసప్తమి స్నానంలో జిల్లేడు ఆకులు, రేగు పళ్లను తలపై పెట్టుకోవడం వెనుక ఆరోగ్య కారణాలున్నాయి. జిల్లేడు, రేగు, రుద్రాక్ష చెట్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని ఎక్కువగా గ్రహించి నిల్వ చేసుకుంటాయి. ఏడాదికి ఒక్కసారైనా ఈ ఆకుల స్పర్శ శరీరానికి తగలడం వల్ల అవి ఔషధ గుణాలుగా పని చేస్తాయి. చర్మ వ్యాధులను నివారిస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే వీటితో శిరస్నానం చేయాలని పెద్దలు సూచిస్తారు.
News January 24, 2026
APలో ఏర్పాటు కానున్న WEF C4IR కేంద్రం

AP: నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(WEF) 5 కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. అందులో ఒకటి రాష్ట్రంలో నెలకొల్పేందుకు నిర్ణయించింది. ఇండియా(AP), ఫ్రాన్స్, UK, UAEలలో ఇవి ఏర్పాటు కానున్నాయి. WEF 2017లో ప్రారంభించిన 4వ పారిశ్రామిక విప్లవ నెట్వర్క్ ప్రభుత్వ, ప్రైవేటు, పరిశ్రమల సమన్వయానికి ఒక వేదికగా పనిచేస్తోంది. ఇప్పటికే ఇండియాలో ఈ తరహా సెంటర్స్ హైదరాబాద్, ముంబైలో ఉన్నాయి.


