News June 29, 2024
ఇందిరా మమ్మల్ని జైలులో పెట్టినా హింసించలేదు: లాలూ ప్రసాద్

ఎమర్జెన్సీ సమయంలో మాజీ PM ఇందిరా గాంధీ తమను జైలులో పెట్టినా హింసించలేదని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ‘ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975’ పేరుతో రాసిన ఆర్టికల్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో తాను 15 నెలల పాటు జైలులో ఉన్నానని తెలిపారు. ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా ఎలా ఉందో.. ఇప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవించకపోవడమూ అటువంటి మచ్చే అని మరచిపోకూడదని పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
UGC రూల్స్‌పై సుప్రీం స్టే

UGC ప్రవేశపెట్టిన కొత్త రూల్స్‌పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణ వరకు 2012 రూల్స్ అమలులో ఉంటాయని తెలిపింది. యూజీసీ కొత్తగా ప్రవేశపెట్టిన రూల్స్ అస్పష్టంగా ఉన్నాయని, దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. కేంద్రానికి నోటీసులు జారీ చేసిన CJI విచారణను మార్చి 19కి వాయిదా వేశారు.
News January 29, 2026
కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు 3pmకు విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు సిట్ నోటీసులిచ్చింది. HYD నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు CRPC 160 కింద మాజీ సీఎం పీఏకు నోటీసులు అందించారు. రేపు 3pmకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65సం.లకు పైగా వయస్సు ఉండటంతో స్టేషన్‌కు రావడం తప్పనిసరి కాదని తెలిపారు. PSకు రావాలి అనుకుంటే రావచ్చు, లేదా HYD పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
News January 29, 2026
ఆవనూనెతో చర్మ సంరక్షణ

ఆవనూనె, కొబ్బరి నూనె కలిపి ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్ ఆయిల్‌ని కలపాలి. దీనికి చెంచా బియ్యప్పిండి చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.


