News December 2, 2024
ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఓపెన్: మంత్రి

TG: ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ ‘ఈనెల 5న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్ను ఓపెన్ చేస్తాం. ప్రతి గ్రామానికి అధికారుల బృందాలు వస్తాయి’ అని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
Similar News
News January 3, 2026
ECGతో గుండెపోటును ముందే గుర్తించలేం: వైద్యులు

ఈసీజీ రిపోర్ట్ నార్మల్గా ఉన్నంత మాత్రాన గుండెపోటు ముప్పు లేదని నిర్ధారించలేమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ECG కేవలం ఆ క్షణంలో గుండె స్థితిని మాత్రమే చూపిస్తుంది. గుండెపోటుకు కొన్ని గంటల ముందు తీసిన ECG కూడా చాలా మందిలో నార్మల్గా వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో పూడికలు(Plaque) ఎప్పుడు పగిలి గుండెపోటు వస్తుందో ముందే ఊహించలేదు. నిర్లక్ష్యం చేయకుండా ఇతర పరీక్షలు చేయించుకోవాలి’ అని సూచిస్తున్నారు.
News January 3, 2026
BRS సభకు ఎందుకు రావడం లేదో చెప్పాలి.. శ్రీధర్ బాబు డిమాండ్

TG: అసెంబ్లీ సమావేశాలంటే బీఆర్ఎస్కు చులకనని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. కీలక ప్రాజెక్టులపై చర్చ జరుగుతుంటే ఎందుకు రావడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు.
News January 3, 2026
అరటిలో మాంగనీసు లోప లక్షణాలు – నివారణ

అరటి తోటలో మాంగనీసు ధాతులోపం వల్ల ముదురు ఆకులపై నిర్ణీత ఆకారం లేని పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగు మచ్చ మధ్యలో ఎండిపోతుంది. మాంగనీసు ధాతులోపం తీవ్రమైతే ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. పిలకల లేత ఆకులు, ఆకుమచ్చ చారలతో తెల్లగా మారి లోపం తీవ్రమైనప్పుడు ఎండిపోతాయి. లోప నివారణకు లీటరు నీటికి మాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు కలిపి ఆకులన్నీ తడిచేలా 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.


