News December 3, 2024

ఇందిరమ్మ ఇళ్లు.. యాప్‌ను ప్రారంభించిన మంత్రి

image

TG: ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసేందుకు బిల్డ్ నౌ యాప్‌ను తీసుకొచ్చింది. దీనిని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. దీని ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పించింది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనుంది.

Similar News

News January 6, 2026

ఆస్కార్ 2026: నెక్స్ట్ రౌండ్‌కి దూసుకెళ్లిన ‘హోమ్‌బౌండ్’

image

భారతీయ సినిమా ‘హోమ్‌బౌండ్’ ఆస్కార్ బరిలో మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే ఈ మూవీ 98వ అకాడమీ అవార్డులలో ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో టాప్-15కి చేరింది. తాజాగా నెక్స్ట్ రౌండ్‌ ఓటింగ్‌కు ఎంపికైంది. జనవరి 22న ఆస్కార్ నామినేషన్లను ప్రకటించనున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెఠ్‌వా ప్రధాన పాత్రల్లో నటించారు. పోలీస్ అవ్వాలనుకునే ఇద్దరు స్నేహితులకు ఎదురైన సవాళ్లే ఈ సినిమా కథ.

News January 6, 2026

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>సౌత్ ఈస్ట్రన్<<>> రైల్వే స్పోర్ట్స్ కోటాలో 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులై, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించినవారు అర్హులు. స్పోర్ట్స్ ట్రయల్స్‌, స్పోర్ట్స్, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rrcser.co.in

News January 6, 2026

ట్యూటర్ నుంచి వ్యాపారం వైపు అడుగులు

image

సుజాతా అగర్వాల్ హోమ్ సైన్స్‌లో పీజీ చేశారు. పెళ్లి తర్వాత గార్డెనింగ్‌పై మక్కువతో తొలుత ఇంటి దగ్గరే పూల మొక్కలు పెంచుతూ పిల్లలకు ట్యూషన్ చేప్పేవారు. కరోనాలో ఇంటికే పరిమితం కావడంతో ఇంటర్‌నెట్‌లో హైడ్రోపోనిక్స్(మట్టి లేకుండా కేవలం నీటితోనే పంటలు పండించడం) వ్యవసాయ పద్ధతి గురించి తెలుసుకొని, అధ్యయనం చేసి కూరగాయలు పండించాలనుకున్నారు. దానికి అవసరమైన కిట్ కొని దాన్ని ఇంట్లోనే ఒక గదిలో ఏర్పాటు చేశారు.