News July 10, 2024

అధ్యయనాల తర్వాతే ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

image

TG: ఇందిరమ్మ ఇళ్ల నమూనాలపై అధ్యయనానికి తమ బృందాలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆ నివేదికలు రాగానే ఏడాదికి 4.50లక్షల చొప్పున ఇళ్లు నిర్మించి ఇస్తామని వెల్లడించారు. అటు రాజీవ్ స్వగృహ టవర్స్ ధరలపై కమిటీ నివేదిక అనంతరం వేలం వేయడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే రేషన్‌కు, వైద్యచికిత్సకు వేర్వేరు కార్డులు అందిస్తామని తెలిపారు.

Similar News

News January 20, 2026

మెగా హీరోతో మారుతి మూవీ.. క్లారిటీ!

image

డైరెక్టర్ మారుతి తర్వాతి మూవీ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థలో మెగా హీరోతో చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన టీమ్ ఖండించింది. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేసింది. మారుతి తర్వాతి సినిమాపై అధికారికంగా ప్రకటన చేస్తామని పేర్కొంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ‘రాజాసాబ్’ మూవీ ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.

News January 20, 2026

CRPF పురుషుల బృందాన్ని నడిపించనున్న మహిళా అధికారి!

image

రిపబ్లిక్ డే కవాతులో చరిత్ర సృష్టించేందుకు CRPF అసిస్టెంట్ కమాండెంట్ సిమ్రాన్ బాలా(26) సిద్ధమవుతున్నారు. J&Kకు చెందిన ఈ అధికారి తమ పురుష దళానికి నాయకత్వం వహించనున్నారు. CRPFలో 140 మందితో కూడిన మేల్ కమాండ్‌ను లేడీ ఆఫీసర్ లీడ్ చేయడం ఇదే తొలిసారి. రాజౌరి(D) నుంచి ఆఫీసర్ ర్యాంకులో చేరిన తొలి మహిళ కూడా బాలానే కావడం విశేషం. 2020లో ఆర్మీ డే పరేడ్‌ను లీడ్ చేసిన మొదటి మహిళగా తానియా షేర్ గిల్ నిలిచారు.

News January 20, 2026

ఆ విషయం నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: గుడివాడ

image

AP: చలి కారణంగా తాను దావోస్ వెళ్లలేదని లోకేశ్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని YCP నేత గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. బ్రాండ్ ఇమేజ్‌తో కాదు బ్యాండ్ మేళంతో CBN, లోకేశ్ సమ్మిట్‌కు వెళ్లారని ఎద్దేవా చేశారు. పండుగ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు. కేంద్రంలో చక్రం తిప్పుతున్నాం అని చెప్పుకునే వాళ్లు NTRకు భారతరత్న ఎందుకు తెచ్చుకోలేకపోయారని నిలదీశారు.