News February 21, 2025

‘ఇందిరమ్మ ఇళ్లు’ నేడు షురూ.. దశలవారీగా డబ్బు చెల్లింపు ఇలా

image

TG: పేదలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. నారాయణపేట(D) అప్పకపల్లెలో CM రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. తొలి దశలో 72,045 ఇళ్లకుగాను MLC ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పనులు ప్రారంభమవుతాయి. లబ్ధిదారులకు బేస్‌మెంట్ లెవెల్‌లో ₹లక్ష, గోడలు నిర్మించాక ₹1.25 లక్షలు, స్లాబ్ తర్వాత ₹1.75 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక ₹లక్ష ప్రభుత్వం అందజేయనుంది.

Similar News

News November 28, 2025

14 ఏళ్లకే ప్రేమ, జంప్.. ఎందుకిలా?

image

విజయవాడకు చెందిన బాలిక(14), బాలుడు(13) ఇంటి నుంచి పారిపోవడంపై నెటిజన్లు షాకవుతున్నారు. అంతచిన్న వయసులో ఇలాంటి ఆలోచన, ధైర్యం రావడమేంటని కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలు, సోషల్ మీడియా వల్లే ఇలా జరుగుతోందంటున్నారు. బుధవారం బాలుడు తన తండ్రి ఫోన్, రూ.10వేలు తీసుకుని అమ్మాయితో హైదరాబాద్ వచ్చాడు. తుక్కుగూడలో రూమ్ కోసం వెతుకుతుండగా ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పేరెంట్స్‌కు అప్పగించారు.

News November 28, 2025

‘థర్డ్ వరల్డ్’ దేశాల లిస్ట్‌లో భారత్‌ ఉందా?

image

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను నిలిపివేస్తామని ట్రంప్<<18410545>> ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ‘థర్డ్ వరల్డ్’ పదం ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాపులర్ అయింది. అప్పట్లో అమెరికా-నాటో దేశాలు ఫస్ట్ వరల్డ్, సోవియట్ యూనియన్ అనుబంధ దేశాలు సెకండ్ వరల్డ్‌గా, ఏ పక్షానికీ చేరని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాలను ‘థర్డ్ వరల్డ్’ అని పిలిచేవారు. UN LDCs లిస్ట్ ప్రకారం ఇందులో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో భారత్‌ లేదు.

News November 28, 2025

మేనరిక వివాహాలు చేసుకుంటున్నారా?

image

మేనరికపు వివాహాలు చేసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వివాహం అయితే జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్‌ కారణాలతో గర్భస్రావం అవుతుంటే కార్యోటైప్‌ టెస్ట్‌, అబార్షన్‌ అయితే పిండానిదీ, తల్లిదండ్రులదీ జెనెటిక్‌ మేకప్‌ చేయించుకోవాలి. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ముందే చెక్ చేయించుకోవాలి.